సాయి పల్లవి ఉన్నా.. సౌండే లేదేంటి?

స్టార్ హీరోయిన్ సాయి పల్లవి.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Update: 2024-10-23 09:36 GMT

స్టార్ హీరోయిన్ సాయి పల్లవి.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో యంగ్ హీరో నాగ చైతన్యతో తండేల్ చిత్రం చేస్తున్న ముద్దుగుమ్మ.. అటు బాలీవుడ్ లో రామాయణం మూవీలో నటిస్తున్నారు. వాటితో పాటు మరికొన్ని ప్రాజెక్టుల్లో యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అమరన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 31వ దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేయనున్నారు నేచురల్ బ్యూటీ.

కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్, సాయి పల్లవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న అమరన్ మూవీని రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కిస్తున్నారు. భారత దివంగత ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ లైఫ్ స్టోరీ ఆధారంగా రూపొందిస్తున్నారు. ముకుంద్ వరదరాజన్‌ గా శివ కార్తికేయన్ నటిస్తుండగా.. ఆయన భార్య ఇందు రెబెకా వర్గీస్‌ గా సాయి పల్లవి కనిపించనున్నారు. ఇప్పటికే మేకర్స్ సాయి పల్లవి క్యారెక్టర్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే తమిళంతో పాటు తెలుగులో కూడా అమరన్ మూవీ రిలీజ్ అవ్వనున్న విషయం తెలిసిందే. కానీ మేకర్స్ మాత్రం.. టాలీవుడ్ వెర్షన్ కు గాను ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. తమిళ వెర్షన్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. తెలుగులో ఇప్పటి వరకు ఎలాంటి ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహించలేదు. మన దగ్గర సాయి పల్లవికి మంచి క్రేజ్ ఉన్నప్పటికీ.. ఆమె బ్రాండ్ ను యూజ్ చేసుకోలేదు! ఆమె ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ ప్లాన్ చేసినట్లు లేరు.

తమిళంతో పాటు తెలుగు ట్రైలర్ ను ఈరోజు (అక్టోబర్ 23) సాయంత్రం ఆరు గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ రీసెంట్ గా తెలిపారు. ఆ తర్వాత ఏమైనా ఇంటర్వ్యూలు ఇచ్చే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారేమో తెలియదు. ప్రస్తుతానికి మాత్రం ఎలాంటి సౌండ్ లేదు. అదే సమయంలో రజినీకాంత్ వేట్టయన్ మూవీలానే అమరన్ టైటిల్ తోనే సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. వేట్టయన్ మూవీ విషయంలో వచ్చిన కామెంట్లను మేకర్స్ పరిగణనలోకి తీసుకున్నట్లు లేరేమో!

మరోవైపు, శివ కార్తికేయన్ కు తెలుగులో క్రేజ్ ఉన్నా.. మిగతా కోలీవుడ్ స్టార్ హీరోలు విజయ్, సూర్య తదితరులకు ఉన్నంత మార్కెట్ లేదు. ఆయన నటించిన సినిమాలు ఒక్కొక్కటి ఒక్క విధంగా రిజల్ట్ ను అందుకున్నాయి. ఇప్పుడు కంటెంట్ పై నమ్మకంతో అమరన్ ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా శివకార్తికేయన్, సాయి పల్లవితో పాటు అమరన్ టీమ్ తెలుగు ప్రమోషన్స్ పై ఇకనైనా దృష్టి పెట్టాలి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News