పెళ్లిలో సాయి పల్లవి డ్యాన్స్.. ఆ స్టెప్పులకు ఫిదా అవ్వాల్సిందే..

హీరోయిన్ సాయి పల్లవి.. ఎలాంటి డ్యాన్సరో అందరికీ తెలిసిందే.

Update: 2024-09-11 07:52 GMT

హీరోయిన్ సాయి పల్లవి.. ఎలాంటి డ్యాన్సరో అందరికీ తెలిసిందే. తన యాక్టింగ్ తోపాటు డ్యాన్స్ తో వేరే లెవల్ లో ఫ్యాన్స్ సంపాదించుకుంది. సరైన పాట ఉంటే చాలు.. సినిమాలో డ్యాన్స్ తో ఓ రేంజ్ లో అదరగొట్టేస్తుంది. ఆడియన్స్ చూపు తిప్పుకోనివ్వకుండా మాయ చేస్తుంది. ఒక్కో స్టెప్ ను తనదైన శైలిలో వేస్తూ ఫిదా చేస్తుంది. ఆమెకు డ్యాన్స్ కు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాయి.

అయితే సాయి పల్లవి తన చెల్లెలు పూజా కన్నన్ పెళ్లి లో డ్యాన్స్ చేస్తున్న వీడియోలు నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ వేడుక జరిగి కొద్ది రోజులు అవుతున్నా.. ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. తాజాగా పూజా కన్నన్ సంగీత్ లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు డ్యాన్స్ చేస్తున్న వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో సాయి పల్లవి మైమరచిపోయి డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఫేమస్ మరాఠీ సాంగ్ అప్సరా ఆలీ సాంగ్ కు సాయి పల్లవి, పూజా కన్నన్ అద్భుతంగా డ్యాన్స్ చేసి మెప్పించారు. బ్లూ కలర్ డ్రెస్ లో సాయి పల్లవి డ్యాన్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. ఒక్కో మూవ్ కు.. తన ఎక్స్పెషన్స్ తో అదరగొట్టేసింది. సాంగ్ కు తగట్టు డ్యాన్స్ చేసి సందడి చేసింది. దీంతో సంగీత్ కు వచ్చిన వారంతా చప్పట్లతో హోరెత్తించారు. ఈలలతో మోత మోగించారు. సాయి పల్లవి డ్యాన్స్ పై ప్రశంసలు కురిపించారు.

అయితే పెళ్లిలో తన చెల్లిని రెడీ చేయడానికి సాయి పల్లవి కష్టపడడం, ఆ తర్వాత పూజ తన అక్కను పూర్తి పేరుతో ముద్దుగా పిలవడం.. త్వరగా రెడీ చేయమని అడగడం.. ఫ్యామిలీ అంతా డ్యాన్స్ చేయడం.. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. వివాహ వేడుక సమయంలో సాయి పల్లవి కేరళ సంప్రదాయ చీరకట్టులో అదిరిపోయింది. పెళ్లి జరిగిన తర్వాత కూడా తన డ్యాన్స్ తో వచ్చిన వారిందరినీ మెప్పించింది.

ఇక సాయి పల్లవి సినిమాల విషయానికొస్తే.. యంగ్ హీరో నాగచైతన్యకు జోడీగా ప్రస్తుతం తండేల్ లో నటిస్తోంది. ఆమె రోల్ కు సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అయితే తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తోంది నేచురల్ బ్యూటీ. కోలీవుడ్ లో అమరన్, బాలీవుడ్ లో రామాయణ్ సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. మరి తన కొత్త చిత్రాలతో ఆమె ఎలాంటి హిట్స్ అందుకుంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News