సాయి పల్లవి.. ఆ సినిమాకి పెద్ద సవాల్
పవిత్ర ఇతిహాసం రామాయణం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ రామాయణ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
పవిత్ర ఇతిహాసం రామాయణం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ రామాయణ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇండియన్ మూవీ లవర్స్ ను ఎంతో ఊరిస్తున్న ఆ ప్రాజెక్ట్ లో రాముడిగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, సీతగా హీరోయిన్ సాయి పల్లవి నటిస్తున్నారు. రావణుడిగా కన్నడ స్టార్ హీరో యష్ యాక్ట్ చేస్తున్నారు. అదే సమయంలో మూవీ ప్రొడక్షన్ లో కూడా ఆయన భాగమయ్యారు. సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
సన్నీ డియోల్, రకుల్, లారా దత్తా వంటి ప్రముఖ నటీనటులు సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం మూవీ షూటింగ్ స్టార్ అవ్వగా.. ఆ మధ్య కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి. అందులో రణబీర్, సాయి పల్లవి తమ తమ పాత్రల్లో కనిపించారు. మూవీ షూటింగ్ మొదలైన కొద్దిరోజుల్లోనే ఫోటోస్ లీక్ కావడంతో మేకర్స్.. ఇప్పుడు ముంబైలో ఇండోర్ షూటింగ్ చేస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.
అదే సమయంలో ఇప్పుడు రామాయణ్ మేకర్స్.. సినిమా తెరకెక్కించే విధానంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. హిందూ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా చూడాలని చెబుతున్నారు. ఎక్కడా ఏదీ మిస్ ఫైర్ అవ్వకుండా సినిమా తీయాలని సూచిస్తున్నారు. లేకుంటే పెద్ద సవాల్ ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అందుకు ఉదాహరణలు కూడా చెబుతున్నారు.
రామాయణం ఆధారంగా అనేక సినిమాలు ఇప్పటికే తెరకెక్కిన విషయం తెలిసిందే. అందులో 2010లో మణిరత్నం తీసిన రావణ్ మూవీ అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు. గత ఏడాది పాన్ ఇండియా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ గా మారింది. దారుణంగా విమర్శలు, ట్రోల్స్ ఎదుర్కొంది. రోల్స్ గెటప్స్ తో పాటు వీఎఫ్ ఎక్స్ విషయంలో వేరే లెవెల్ లో మేకర్స్ ను ట్రోల్స్ చేశారు నెటిజన్లు
రీసెంట్ గా దీపావళికి వచ్చిన సింగం అగైన్ మూవీ కూడా రామాయణం బ్యాక్ డ్రాప్ తోనే తెరకెక్కింది. డైరెక్టర్ రోహిత్ శెట్టి ఐడియా బాగున్నా.. ఆడియన్స్ ను పెద్ద ఎక్కలేదని చెప్పాలి. దీంతో రామాయణం ఆధారంగా వచ్చిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుండడంతో జాగ్రత్తలు తీసుకోవాలని, బాగా కష్టపడాలని రామాయణ్ మేకర్స్ కు నెటిజన్లు సోషల్ మీడియాలో సజ్జెస్ట్ చేస్తున్నారు. మరి ఆ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.