ఆ గిమ్మిక్కులు మాకవసరం లేదండోయ్..!
వాటి వల్ల నిత్యం వార్తల్లో ఉంటూ ఏదో ఒక విధంగా ప్రేక్షకుల్లో డిస్కషన్స్ అవుతుంటారు.
సెలబ్రిటీ హోదా రావడం ఒక ఎత్తైతే దాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. ముఖ్యంగా గ్లామర్ ఫీల్డ్ లో తమకంటూ ఒక సెపరేట్ క్రేజ్, ఇమే సంపాదించడం కోసం హీరోలు, హీరోయిన్లు ఎంతో కష్టపడతారు. ఐతే కొందరు వచ్చిన క్రేజ్ ని డబుల్ చేసేందుకు కొన్ని గిమ్మిక్కులు ఉపయోగిస్తారు.వాటి వల్ల నిత్యం వార్తల్లో ఉంటూ ఏదో ఒక విధంగా ప్రేక్షకుల్లో డిస్కషన్స్ అవుతుంటారు. బాలీవుడ్ లో పాపారాజీస్ కల్చర్ తెలిసిందే. అక్కడ కథానాయికలు సెపరేట్ పీ.ఆర్ లను మెయింటైన్ చేస్తుంటారు. ఆ పి.ఆర్ ల వల్లే కొందరు హీరోయిన్స్ రెగ్యులర్ గా ఏదో ఒక విధంగా న్యూస్ లో కనిపిస్తారు.
ఎవరికి వారు తమ టాలెంట్ ని ఎక్స్ పోజ్ చేయడంలో తప్పేమి లేదు. వారికి కావాల్సిన పబ్లిసిటీ పి.ఆర్ లు చేస్తుంటారు. దానికి చాలా పెద్ద మొత్తం లో మంత్లీ పేమెంట్ ఉంటుంది. లేదా ఒకేసారి ప్యాకేజ్ రూపంలో ఇయర్ మొత్తం పి.ఆర్ యాక్టివిటీస్ చేస్తుంటారు. సౌత్ లో ఈ పి.ఆర్ యాక్టివిటీస్ చాలా తక్కువ అనే చెప్పొచ్చు. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ ఫాం కొనసాగిస్తున్న ప్రతి హీరోయిన్ ఇదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు. వారిలో ఎంత టాలెంట్ ఉన్నా ప్రేక్షకులకు తెలియనిదే ఏం లాభం అన్నట్టుగా ఈ పాపారాజీస్ ప్రక్రియ కొనసాగుతుంది.
ఐతే సౌత్ సినిమాల్లో కొందరు వీటిని అసలు పట్టించుకోరు. స్టార్ హీరోయిన్స్ కూడా పి.ఆర్ వ్యవస్థ మీద ఆసక్తి చూపించట్లేదు. కారణాలు ఏవైనా అయ్యుండొచ్చు కానీ పి.ఆర్ యాక్టివిటీస్ మాకు అవసరం లేదంటున్నారు సౌత్ భామలు. అలాంటి వారిలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ఒకరు. సాయి పల్లవి సెపరేట్ పి.ఆర్ ప్రమోషన్స్ అవసరం లేదు ఆమె కనిపిస్తే చాలు సౌత్ ఇండస్ట్రీ యూత్ అంతా జోష్ లో ఉంటారు. అలాంటి సాయి పల్లవి పి.ఆర్ కల్చర్ మీద అసలు నమ్మకం లేదని అంటుంది. స్నేహితులు గతంలో సలహాలు ఇచ్చినా దాన్ని ఆమె తోసిపుచ్చినట్టు ఆమధ్య చెప్పుకొచ్చారు.
అంతేకాదు రెగ్యులర్ గా వార్తల్లో ఉన్నా కూడా ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తామని అంటుంది సాయి పల్లవి. పి.ఆర్ వ్యవస్థ వల్ల అవకాశాలు వస్తాయన్న నమ్మకం లేదని చెప్పింది. సాయి పల్లవి లానే ఇదివరకు నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి కూడా పాపారాజీస్ గురించి చెప్పి షాక్ ఇచ్చింది. పాపారాజీస్ కి తాను డబ్బులు ఇవ్వనని అలాంటి వాటి మీద తనకు నమ్మకం లేదని చెప్పింది ప్రియమణి.
సో కథానాయికలంగా ఒకలా ఉంటారని చెప్పడం కష్టం. కానీ పి.ఆర్ వ్యవస్థని వ్యతిరేకించడం అనేది కొత్తగా ఉంది. ఐతే ప్రేక్షకులను మోసం చేసే ఆ గిమ్మిక్కులు మాకొద్దు. తమ అభినయంతోనే వారిని మెప్పిస్తాం అంటున్నారు సాయి పల్లవి లాంటి హీరోయిన్లు. ఆమె నిర్ణయాన్ని కచ్చితంగా అందరు గౌరవించాల్సిందే.