పావ‌లా శ్యామ‌ల‌కు సుప్రీమ్ హీరో సాయం

పావ‌లా శ్యామ‌ల‌ మనుగడ, వైద్య ఖర్చుల కోసం సాయి తేజ్ ఆమెకు 1 లక్ష రూపాయలతో సహాయం చేశాడు.అతడు వీడియో కాల్ లో శ్యామ‌ల‌తో మాట్లాడాడు.

Update: 2024-07-27 04:05 GMT

ఆర్టిస్టుల జీవితం అంత సులువు కాదు! దీపం ఉండ‌గానే చ‌క్క‌దిద్దుకోగ‌లిగే ఆర్టిస్టులు అతి కొద్దిమంది మాత్ర‌మే. జూనియ‌ర్ ఆర్టిస్టులు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల‌కు నిరంత‌రం ఆదాయ మార్గాలు ఉండ‌వు. ఇది పెన్ష‌న్ వ‌చ్చే ఉద్యోగం కాదు. ప‌రిశ్ర‌మ త‌ర‌పున ఆదుకునేందుకు ఉదారంగా సాయం చేసేందుకు చాలా మంది లేరు. అసోసియేష‌న్ల సాయం ప‌రిమితం మాత్ర‌మే. అలాంట‌ప్పుడు ఇక్క‌డ వృద్ధాప్య జీవితాన్ని ముందుకు సాగించేదెలా? అంటే అది ఎప్పుడూ స‌మ‌స్యాత్మ‌క‌మైన‌దే.

అలాంటి స‌మ‌స్య‌ల సుడిగుండంలో ఉన్న ఆర్టిస్టులు కృష్ణాన‌గ‌ర్, ఫిలింన‌గ‌ర్ లో ఎంద‌రో. చాలా కాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న న‌టి పావలా శ్యామలను ప‌లుమార్లు మెగా కుటుంబీకులు ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయినా ఇప్ప‌టికీ పోష‌ణ భార‌మై క‌ష్ట‌కాలంలో ఉన్న శ్యామ‌ల‌ను ఆదుకోవడానికి ఇప్పుడు మెగా కుటుంబం నుంచే సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ (సాయి ధరమ్ తేజ్) ముందుకు వ‌చ్చారు.

మామయ్య‌లు చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ర‌హాలోనే కరుణ, సామాజిక సేవకు పేరుగాంచిన ఈ యువ‌హీరో మ‌రోసారి త‌న‌ దయను చాటుకున్నారు. పావ‌లా శ్యామ‌ల‌ మనుగడ, వైద్య ఖర్చుల కోసం సాయి తేజ్ ఆమెకు 1 లక్ష రూపాయలతో సహాయం చేశాడు.అతడు వీడియో కాల్ లో శ్యామ‌ల‌తో మాట్లాడాడు. భవిష్యత్తులోను ఈ వృద్ధ ఆర్టిస్టుకు తన మద్దతు ఉంటుందని హామీ ఇచ్చాడు.

ఇటీవల బాల‌ల వేధింపుల వీడియోను షేర్ చేసిన‌ యూట్యూబర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, పోలీసుల‌కు విజ్ఞ‌ప్తి చేసిన సాయిధ‌ర‌మ్ ఈ వేధింపుల‌పై తీవ్ర ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసారు. చివ‌రికి దోషుల‌కు శిక్ష ప‌డేలా చేసారు. ఇత‌రులు క‌ష్టంలో ఉంటే స్పందించే త‌త్వం సాయి తేజ్ది. దేనితో సంబంధం లేకుండా తన పరిధి మేరకు అన్ని విధాలుగా మంచి పని చేస్తూనే ఉన్నాడు.

ఈ సంవత్సరం ప్రారంభంలో అతడు సిద్దిపేటలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో వాటర్ ప్లాంట్ స్థాపనకు సహాయం చేసాడు. అల్లు అర్జున్ అభిమాని చివరి సెమిస్టర్ ఫీజు చెల్లించడంలో కూడా సాయి తేజ్ సహాయం చేశాడు.

Tags:    

Similar News