ఎగ్ పఫ్స్ వివాదం.. సాయి ధరమ్ తేజ్ అలా అన్నాడేంటి..

ఎగ్ పఫ్స్ వివాదం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

Update: 2024-08-27 06:33 GMT
ఎగ్ పఫ్స్ వివాదం.. సాయి ధరమ్ తేజ్ అలా అన్నాడేంటి..
  • whatsapp icon

ఎగ్ పఫ్స్ వివాదం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఎగ్ పఫ్స్ కోసం రూ.3.62 కోట్లు దుర్వినియోగం చేసిందని ఆరోపణలు వస్తున్నాయి. సీఎం ఆఫీస్ సిబ్బంది రోజుకు యావరేజ్ గా 993 ఎగ్ పఫ్స్ తిన్నారని, మొత్తం ఐదేళ్లలో 18 లక్షల ఎగ్ పఫ్స్ తిన్నారని వివరాలను పేర్కొంటూ టీడీపీ తీవ్రంగా ఆరోపిస్తోంది. అదే సమయంలో వైసీపీ కూడా అవి కల్పితమైనవిగా అభివర్ణిస్తోంది.

అలా సోషల్ మీడియాలో ఎగ్ పఫ్స్ మ్యాటర్ తీవ్ర దుమారం రేపుతోంది. వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయ మాటల యుద్ధంలో సెంటర్ పాయింట్ గా మారింది. ఇప్పుడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. ఓ సోషల్ మీడియా యూజర్ కు రిప్లై ఇస్తూ ఎగ్ పఫ్స్ విషయాన్ని ప్రస్తావించారు. దీంతో ఆయన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అసలేమైందంటే?

వైసీపీ అభిమాని అయిన డా.చింతా ప్రదీప్ రెడ్డి అనే సోషల్ మీడియా యూజర్.. మెడలు రుద్దే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ.. అన్నా క్యాంటీన్లలో ప్లేట్లు కడగొచ్చుగా సేఫ్ హ్యాండ్స్ తో.. అంటూ ట్వీట్ చేశారు. హీరో సాయి ధరమ్ తేజ్ ను ట్యాగ్ చేశారు. అంతకుముందు తణుకు అన్న క్యాంటీన్లలో పరిస్థితి అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. పేదవాడు భోజనం చేయాల్సిన ప్లేట్లను అశుభ్రంగా ఉన్న నీటిలో కడుగుతూ భోజనానికి వచ్చిన పేదవాళ్ల పట్ల కటువుగా మాట్లాడుతూ నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆరోపించారు.

అయితే సాయి ధరమ్ తేజ్ ను ట్యాగ్ చేయడంతో వెంటనే ఆయన స్పందించారు. డాక్టర్ గారు.. మీరు ఎక్కడ ఉంటారని అడిగారు. అది నా బయోలో ఉంటుంది బ్రో... దురదృష్టవశాత్తు ఏపీలో సురక్షితమైన చేతులు మిస్ అయ్యాయి.. అని ఆ డాక్టర్ ఆరోపించారు. అప్పుడు ఓహ్ ఓకే సరే, ఎగ్ పఫ్స్ బిల్లు చాలా ఎక్కువగా ఉంది సార్, మీరు బాగా తిని ఉంటారని ఆశిస్తున్నాం. జాగ్రత్త తీసుకోండి సార్ అని ట్వీట్ చేశారు. దీంతో వీరి మధ్య జరిగిన ట్వీట్ వార్.. నెట్టింట వైరల్ గా మారింది.

కాగా, సాయి ధరమ్ తేజ్.. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో అనుకోని ఘటన కూడా జరిగింది. ఆ తర్వాత పవన్ గెలిచాక.. సాయి ధరమ్ తేజ్ వేరే లెవెల్ లో సెలబ్రేషన్ చేసుకున్నారు. రీసెంట్ గా ఏపీ.. సేఫ్ హ్యాండ్స్ లో ఉందని పోస్ట్ పెట్టారు. కానీ ఇప్పుడు ఆయనను అనవసరంగా వివాదంలోకి లాగారు. ఆయన కూడా గట్టి రిప్లై ఇచ్చారు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News