మెగా హీరో సిక్స్ ప్యాక్ ప్రయోగం
తెలుగు సినిమా పరిశ్రమలో సహాయగుణం కలిగిన వారిలో సాయిధరమ్ తేజ్ పేరు గట్టిగానే వినిపిస్తుంది.
తెలుగు సినిమా పరిశ్రమలో సహాయగుణం కలిగిన వారిలో సాయిధరమ్ తేజ్ పేరు గట్టిగానే వినిపిస్తుంది. తాజాగా, తన సహాయంతో ప్రముఖ నటి పావలా శ్యామలకు మరింత సాయం అందించి తన మానవతా కృతజ్ఞతను చాటుకున్నారు. ఆమెకు రూ.లక్ష ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. ఈ చెక్‌ను ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ద్వారా ఆమెకు అందించారు. అవసరమైతే భవిష్యత్తులో మరింత సహాయం అందిస్తానని మాట ఇచ్చారు.
సాయి తేజ్ కి ప్రమాదం జరిగినప్పుడు తానెంతో బాధ పడ్డానని, త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్ధించానని, ఆయన తన మొర ఆలకించారని పావలా శ్యామల కన్నీరు పెట్టుకొన్నారు. గతంలో చిరంజీవి, పవన్ కల్యాణ్‌లు సైతం తనకు సహాయపడ్డారని ఆమె గుర్తుచేసుకున్నారు. ఇక సాయి ధరమ్ తేజ్ ఇటీవల వెండితెరకు కొంత గ్యాప్ తీసుకున్నాడు.
రొటీన్ కమర్షియల్ కథలను పక్కన పెట్టి డిఫరెంట్ కంటెంట్ ఉన్న స్టోరీలను వెతికే పనిలో పడ్డాడు. ఇక తాజాగా సాయిధరమ్ తేజ్ తన ఫిజిక్ మీద మరింత శ్రద్ధ పెట్టడం ప్రారంభించారు. రోడ్డు ప్రమాదం తర్వాత ఫిజిక్‌ని పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల బొద్దుగా మారిన తేజ్, ఇప్పుడు కొత్త సినిమాకు సిద్ధమవుతున్నారు. ఇక రీసెంట్ గా సెట్స్‌పైకి తీసుకెళ్లిన న్యూ సినిమాలో తను సిక్స్ ప్యాక్‌తో కనిపించనున్నారు.
కథకు ఫిట్నెస్ చాలా అవసరం అని పూర్తి స్థాయిలో చేంజ్ అవుతున్నాడు. పర్ఫెక్ట్ గా క్యారెక్టర్ కు తగ్గట్టుగా ఫిట్నెస్ మెరుగుపర్చుకొని, బాగా తగ్గారు. రోహిత్ పి.కె దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా స్వాతంత్ర్యం రాక పూర్వం జరిగిన కథతో తెరకెక్కిస్తున్నారు. ఇందులో తేజ్ స్వాతంత్య్ర సమర యోధుడిగా కనిపించనున్నారు. ఈ పాత్రకు తగ్గట్టుగా సిక్స్ ప్యాక్ కోసం శ్రమించారు.
ఈ సినిమాను దాదాపు రూ.120 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇది తేజ్ కెరీర్లో అత్యంత ఖరీదైన సినిమా. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో షూటింగ్ జరుగుతోంది. ఇక ఆ మధ్య తేజ్ సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కానీ వెంటనే ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇక సాయి మాత్రం ఎన్ని ఆఫర్స్ వచ్చినా కూడా ఆడియెన్స్ కు డిఫరెంట్ కథలను అంధించాలని కథల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఏది పడితే అది ఓకే చేయడం లేదు. మరి రాబోయే సినిమా అతని మార్కెట్ వాల్యూని ఏ స్థాయికి పెంచుతుందో చూడాలి.