ఆ హీరోతో సినిమా ఏంటని విమర్శలకు గురైన హీరోయిన్!
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన `దబాంగ్ 3` తో సయి మంజ్రేకర్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన `దబాంగ్ 3` తో సయి మంజ్రేకర్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి సినిమాలోనే ఏకంగా స్టార్ హీరో సరసన నటించింది. ఆ సినిమా తర్వాత అమ్మడు నటిగా బిజీ అయింది. అయితే తొలి సినిమాలోనే 37 ఏళ్ల వయసున్న హీరోతో నటించడం ఏంటని అప్పట్లో చాలా విమర్శలొచ్చాయి. తాజాగా అమ్మడు వాటిపై స్పందించింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తొలి అవకాశమే సల్మాన్ తో వచ్చింది.
దీంతో వెంటనే అంగీకరించాను. అప్పట్లో నాకు పీఆర్ టీమ్ కూడా లేదు. నన్ను నేను తెరపై చూసుకో వాలనే ఆత్రం తప్పా ఇంకే ఆలోచించలేదు. సల్మాన్ తో అవకాశం రాగానే ఎంతో సంతోషించాను. కానీ సినిమ విడుదలయ్యాక విమర్శలు ఎదురయ్యాయి. 37 ఏళ్ల నటుడి సరసన నటివేంటి? అని ట్రోల్ చేసారు. అవన్నీ నా పై ప్రభావం చూపకూడదనే కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాకి దూరంగా ఉన్నాను.
అయినా నేను చాలా స్ట్రాంగ్ పర్సన్. ఇలాంటివి నన్ను ప్రభావితం చేయవు. ఎవరైనా పొగిడితే సంతోషిస్తాను. విమర్శిస్తే వాటిని రాసుకుని సరిచేసుకుంటాను` అని అంది. దబాంగ్ తర్వాత `గని` సినిమాతో తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చింది. `మేజర్` ,` స్కంద` లాంటి సినిమాలు చేసింది. హిందీలో కంటున్యూటీగా మరో రెండు సినిమాలు చేసింది. ఈ మధ్యనే అరోన్ మెన్ కహాన్ ధమ్ తా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
మరి ఈ సినిమా ఫలితాల పరిస్థితి ఏంటి? అంటే వాటిలో ఒక్క మేజర్ తప్ప మిగిలినవేవి బాక్సాఫీస్ వద్ద రాణించలేదు. తాజాగా సినిమా `అరోన్ మెన్ కహాన్ ధమ్` తో కూడా నిరాశనమే మిగిల్చింది. ఈ సినిమాపై సయి చాలా ఆశలే పెట్టుకుంది. కానీ ఫలితం ఆశించిన విధంగా రాలేదు. ప్రస్తుతం చేతిలో కొత్త అవకాశాలు కూడా లేవు. హిందీ సహా ఇతర భాషల్లోనూ ఛాన్సులు రాలేదు. దీంతో అమ్మడు కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.