'రేస్-4' రంగంలోకి భైరా ఎప్పటి నుంచి అంటే?
తాజాగా ఈసినిమా సైఫ్ అలీఖాన్ నే హీరోగా తీసుకుంటున్నని కన్పమ్ అయింది. అలాగే సినిమాని వచ్చే ఏడాది అధికారికంగా ప్రకటించబోతున్నారుట.
బాలీవుడ్ నుంచి 'రేస్ -4' ఉదంటూ చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. కానీ ఇంతవరకూ అధికారిక ప్రకటన లేదు. 'రేస్' ప్రాంచైజీ నుంచి రిలీజ్ అయిన మూడు భాగాలు భారీ విజయాలు అందుకున్నవే. ఈనేపథ్యంలో కొన్ని రోజులుగా 'రేస్ -4' వ్యవహారం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. రెండు భాగాలలో సైఫ్ అలీఖాన్ హీరోగా నటించాడు? మళ్లీ అతడికే నాల్గవ భాగంలో చాన్స్ ఉంటుందా? ఉండదా? అన్న దానిపై పెద్ద చర్చ సాగుతుంది.
తాజాగా ఈసినిమా సైఫ్ అలీఖాన్ నే హీరోగా తీసుకుంటున్నని కన్పమ్ అయింది. అలాగే సినిమాని వచ్చే ఏడాది అధికారికంగా ప్రకటించబోతున్నారుట. ఈ విషయాన్నినిర్మాత రమేష్ తౌరానీ తెలిపారు. ఆయన మాట్లాడుతూ, ' సైఫ్ అలీఖాన్ తిరిగి రేస్ ప్రాంచైజీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. మొదటి రెండు భాగాల్లో ఆయనే నటించి ప్రేక్షకుల్ని ఎంతగానే ఆకట్టుకున్నారు. ప్రస్తుతం దర్శకుడు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని కన్పమ్ చేసే పనిలో ఉన్నాం.
వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభించి..అధికారికంగా అన్ని వివరాలు తెలియజేస్తాం' అన్నారు. మరి సైఫ్ అలీఖాన్కి ఇది 'దేవర' తెచ్చిన అవకాశం అనాలా? అన్నది సందేహంగా మారింది. 'దేవర' లో సైఫ్ అలీఖాన్ భైరా పాత్రలో మెప్పించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాటకు ధీటుగా భైరా పాత్రని హైలైట్ చేయడంతో పాన్ ఇండియాలో సైఫ్ అలీఖనా్ కి ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది.
'దేవర-2' లో ఆ పాత్ర మరింత సంచలనంగా ఉంటుంది. వీటన్నింటి తర్వాత 'రేస్-4' లో సైఫ్ అలీఖాన్ ఖారారు అవ్వడం ఇంట్రెస్టింగ్. ఈ నేపథ్యంలో రేస్ -4 ని పాన్ ఇండియాలో ప్లాన్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ధైమ్ -4 కూడా రెడీ అవుతుంది. రణబీర్ కపూర్ హీరోగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.