సైంధవ్ కి ఆ కథతో పోలిక?

ఈ మధ్యకాలంలో విక్టరీ వెంకటేష్ ఏడాదికి ఒక సినిమానే చేస్తున్న కూడా చాలా సెలక్టివ్ కథలని మాత్రమే ఎంపిక చేసుకుంటున్నారు

Update: 2023-12-14 04:22 GMT

విక్టరీ వెంకటేష్ హీరోగా వస్తోన్న 75వ చిత్రం సైంధవ్. కంప్లీట్ యాక్షన్ బేస్డ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ చిత్రాన్ని దర్శకుడు శైలేష్ కొలను సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ ఈ మూవీలో వెంకటేష్ కి జోడీగా నటించారు. వెంకీ కెరియర్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ మధ్యకాలంలో విక్టరీ వెంకటేష్ ఏడాదికి ఒక సినిమానే చేస్తున్న కూడా చాలా సెలక్టివ్ కథలని మాత్రమే ఎంపిక చేసుకుంటున్నారు. వాటితో సక్సెస్ కూడా అందుకుంటున్నారు. గురు, నారప్ప, దృశ్యం, ఎఫ్2, ఏఫ్3 సినిమాలు విక్టరీ వెంకటేష్ కి వరుస సక్సెస్ లు ఇచ్చాయి. వీటి తర్వాత కాస్తా బడ్జెట్, స్పానింగ్ పెంచి సైంధవ్ మూవీ చేస్తున్నారు. దీని మీద ఎక్స్ పెక్టేషన్స్ కూడా అందుకు తగ్గట్లుగానే ఉన్నాయి.

అయితే ఈ మూవీ స్టొరీపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో వెంకటేష్ కూతురు అరుదైన వ్యాధితో బాధపడుతుందంట. దానికోసం 15 కోట్లు విలువ చేసే ఇంజక్షన్ అవసరం ఉంటుంది. ఆ ఇంజక్షన్ విలన్ కి కూడా కావాల్సి ఉంటుంది. దానికోసం ఇద్దరి మధ్య పోరాటం జరుగుతుందంట. ఈ స్టొరీ లైన్ గతంలో గోపీచంద్ హీరోగా వచ్చిన ఒక్కడున్నాడు సినిమాకి దగ్గరగా ఉంది.

ఆ మూవీలో బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న హీరోని విలన్ తన అవసరానికి వాడుకోవాలని అనుకుంటాడు. హీరోని చంపి అతని హార్ట్ తీసుకోవాలని అనుకుంటాడు. ఇది తెలిసి హీరో తనని తాను ఎలా కాపాడుకుంటాడు అనేది కథ. ఇంచిముంచు పాయింట్ ఒకేరీతిలో ఉన్నట్లు అనిపిస్తోంది. అయితే సైంధవ్ మూవీ కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. గోపీచంద్ మూవీ ప్రయోగాత్మక చిత్రంగా వచ్చింది.

దీంతో స్టొరీ లైన్ విషయంలో సిమిలారిటీ ఉన్న ట్రీట్మెంట్ పరంగా చాలా వ్యత్యాసం ఉంటుందని విక్టరీ అభిమానులు అంటున్నారు. కచ్చితంగా వెంకటేష్ కెరియర్ లో సైంధవ్ బెస్ట్ మూవీ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News