సైంధవ్.. పెద్ద స్కెచ్చేగా ఇది!

ఇలాంటి పరిస్థితుల్లో శాటిలైట్ ఛానెళ్లు, ఓటీటీలను నడపడం అంత ఈజీ కాదని సినీ నిపుణులు చెబుతున్నారు

Update: 2023-12-27 07:30 GMT

ప్రస్తుతం అంతా ఓటీటీ మేనియా నడుస్తోంది. థియేటర్లలో ఎన్ని సినిమాలు విడుదలైనా.. ఓటీటీల డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. దీంతో ఆయా ఓటీటీ సంస్థలు పోటీపడి సినిమాలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. అదే సమయంలో టీవీ ఛానెళ్లు కూడా భారీగా వెచ్చించి స్టార్ హీరోల చిత్రాలను కొనుగోలు చేసి ప్రసారం చేసి ఫేమ్ సంపాదిస్తున్నాయి. అందుకు గాను పెద్ద స్టార్ల చిత్రాల శాటిలైట్ తో పాటు ఓటీటీ రైట్స్ ను కొనుగోలు చేసేందుకు ఆయా సంస్థలు పోటీ పడుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో శాటిలైట్ ఛానెళ్లు, ఓటీటీలను నడపడం అంత ఈజీ కాదని సినీ నిపుణులు చెబుతున్నారు. ఎప్పటకప్పుడు కొత్త కంటెంట్ ఇస్తున్నా ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేయడం కాస్త కష్టమైన పనేనని అంటున్నారు. అయితే మిగతా ప్రముఖ టీవీ ఛానెళ్లు స్టార్ మా, జెమిని, జీ తెలుగుతో పోల్చుకుంటే రేసులో వెనుకబడ్డ ఈటీవీ పెద్ద ప్లాన్ తాజాగా రంగంలోకి దిగందని వార్తలు వస్తున్నాయి.

కొన్నినెలల క్రితం ఈటీవీ విన్ పేరుతో ఓటీటీ సామ్రాజ్యంలోకి ఎంట్రీ ఇచ్చింది ఆ సంస్థ. కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అందుకే ఇప్పుడు పెద్ద స్కెచ్ వేసిందట. టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న 75వ చిత్రం సైంధవ్.. సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అయితే ఈ మూవీ శాటిలైట్ రైట్స్ ను ఈటీవీ యాజమాన్యం కొనుగోలు చేసిందని కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. డిసెంబర్ 28వ తేదీ హైదరాబాద్లో జరగబోయే సైంధవ్ ఈవెంట్ హక్కులను కూడా ఈటీవీ దక్కించుకుందట.

హైదరాబాద్లో గురువారం జరగబోయే వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేశ్ బాబు, నాని గెస్ట్లుగా రానున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈటీవీ ఈ ఈవెంట్ హక్కులను కొనేసి.. తమ ఛానెల్తో విన్ లో న్యూఇయర్ కానుకగా ప్రసారం చేయాలని అనుకుంటోంది. అలా చేసి రేటింగ్స్ పెంచుకోవాలని పెద్ద స్కెచ్ గీసిందట.

సైంధవ్ శాటిలైట్ రైట్స్తో పాటు ఈవెంట్ రైట్స్ను కొనుగోలు చేసినా.. ఓటీటీ రైట్స్ మాత్రం ఆ సంస్థకు దగ్గలేదు. అందుకోసం ట్రై చేసినా సక్సెస్ అవ్వలేదట. ఈ ఏడాది చిన్నసినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన బేబీని కూడా ఈటీవీ కొనుగోలు చేసి ప్రసారం చేసింది. ఇప్పుడు సైంధవ్ తో మొదలుపెట్టి అలా పెద్ద హీరోల సినిమాలు కొనుగోలు చేయాలని ఫిక్స్ అయిందట. విన్ ఓటీటీని కూడా బలోపేతం చేయడానికి బిగ్ డీల్స్ చేసుకోనుందట. మరి శాటిలైట్ తో పాటు ఓటీటీలో రాణించేందుకు ఈటీవీ సక్సెస్ మంత్ర ఎంత వరకు పనిచేస్తుందో చూడాలి.

Tags:    

Similar News