సైంధవ్ రిస్కు తీసుకోక తప్పడం లేదు
ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో అయితే చాలా గట్టిగానే ఆలోచించినట్లుగా తెలుస్తోంది. మొదట డిసెంబర్ లో విడుదల చేయాలని అనుకున్నారు.
విక్టరీ వెంకటేష్ నెక్స్ట్ సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక లెక్క ఇప్పుడు ఈ సినిమాతో మరొక లెక్క అనే విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఇక ఈ సినిమా కోసం దర్శకుడు శైలేష్ కొలను భారీ స్టార్ క్యాస్ట్ ను రంగంలోకి దింపాడు. బాలీవుడ్ నుంచి అలాగే కోలీవుడ్ నుంచి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా నటీనటులు ఈ సినిమాలో ఉన్నారు.
బాలీవుడ్ నటుడు నవాజ్ సిద్దిఖీ, అలాగే తమిళ నటుడు ఆర్య కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలలో కనిపించబోతున్నారు. ఇక బడ్జెట్ కూడా చాలా ఎక్కువగానే పెట్టినట్లు తెలుస్తోంది. పాన్ ఈ రేంజ్ లో విడుదల చేస్తున్నారు కాబట్టి ఎక్కడ అంచనాలు తగ్గకుండా సినిమాను గ్రాండ్ గా తెరపైకి తీసుకురావాలి అని డిసైడ్ అయ్యారు.
ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో అయితే చాలా గట్టిగానే ఆలోచించినట్లుగా తెలుస్తోంది. మొదట డిసెంబర్ లో విడుదల చేయాలని అనుకున్నారు. ఒకవైపు క్రిస్మస్ మరొకవైపు న్యూ ఇయర్ ను టార్గెట్ చేసి అంత సిద్ధం చేసుకుని ఉండగా అప్పుడే సలార్ దిగింది. డిసెంబర్ 22వ డేట్ ను లాక్ చేసుకోవడంతో మళ్లీ ప్లాన్ మార్చాల్సి వచ్చింది.
ఇక ఇప్పుడు సంక్రాంతికి పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ సైంధవ్ రిస్కు తీసుకోక తప్పడం లేదు. ఒకవైపు మహేష్ బాబు గుంటూరు కారం మరొకవైపు రవితేజ ఈగల్, నాగార్జున నా సామీ రంగా.. ఇలాంటి మాస్ యాక్షన్ మూవీ సినిమాలు రెడీగా ఉన్నాయి. అలాగే మరో క్రేజీ ప్రాజెక్టు హనుమాన్ కూడా ఈ పండుగలో హడావిడి చేసే అవకాశం అయితే ఉంది. పరుశురాం విజయ్ దేవరకొండ ప్రాజెక్టును కూడా దిల్ రాజు అదే సమయానికి విడుదల చేస్తున్నాడు.
ఇంత పోటీలో అసలు థియేటర్స్ దొరుకుతాయా లేదా అని అనుకుంటున్న తరుణంలో సైంధవ్ జనవరి 13న రాబోతున్నట్లు అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. ఈ డేట్ మంచిదే అయినప్పటికీ కూడా అసలు కావలసిన థియేటర్స్ రావడం అనేది చాలా కష్టమైన పని. సైంధవ్ పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతోంది కాబట్టి ఫెస్టివల్‌ను టార్గెట్ చేయడంలో తప్పులేదు. కానీ టాక్ కూడా అందుకు తగ్గట్టుగా ఉండాలి. మంచి కంటెంట్ క్లిక్ అయితే మాత్రం ఈ సంక్రాంతికి సైంధవ బెస్ట్ కలెక్షన్స్ అందుకునే ఛాన్స్ ఉంటుంది. మరి దర్శకుడు శైలేష్ ఏ విధంగా మెప్పిస్తాడో చూడాలి.