#గుసగుస.. స్టార్ హీరో ఫ్యాన్స్ తెలుసుకుని తీరాలి!
పౌరాణిక కథలతో సినిమాలు తీయడం సాహసం. వాటిలో పాత్రల్ని పాత్రధారుల్ని గొప్పగా మలిచి
పౌరాణిక కథలతో సినిమాలు తీయడం సాహసం. వాటిలో పాత్రల్ని పాత్రధారుల్ని గొప్పగా మలిచి.. నాటితరంతో పోలికలు చూసేవారిని మెప్పించడం చాలా గొప్పతనం అవుతుంది. స్టేజీ డ్రామా ఆర్టిస్టులకు ధీటుగా మెప్పించేలా చేయడం అంత సులువు కాదు. పౌరాణికాలను లేదా జానపద కథలను ఎంపిక చేసుకున్న దర్శకులకు ఆర్టిస్టుల సెలక్షన్‌లో ఇలాంటి చాలా సవాళ్లు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా పాత్రధారుల ఎంపిక సరిగా కుదరకపోతే ఓంరౌత్ 'ఆదిపురుష్' తరహాలో వైఫల్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పరాజయంతో పాటు విమర్శలు అంతే దారుణంగా ఉంటాయి.
అయితే ఇప్పుడు యష్ రావణుడిగా నటిస్తుండగా, అతడి సరసన ఒక టీవీ నటిని ఎంపిక చేయడంపై అభిమానులు గుర్రుగా ఉన్నారు. సీనియర్ టీవీ నటి సాక్షి తన్వర్ ని రామాయణం దర్శకుడు నితీష్ తివారి ఎంపిక చేసుకున్నారు. రావణుడి భార్య మండోదరిగా సాక్షి నటించాల్సి ఉంది. కానీ ఈ ఎంపిక యష్ ఫ్యాన్స్ కు రుచించడం లేదు. ఫ్యాన్స్ డైరెక్టుగా దీనిపై సోషల్ మీడియాల్లో తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే అభిమానులు గ్రహించాల్సిన విషయాలు ఇక్కడ చాలా ఉంటాయి. సాక్షి స్థానంలో ఎవరైనా యువనటి లేదా గ్లామర్ ఎక్కువగా ఉన్న నటీమణిని ఎంపిక చేయడం సరైనదేనా? ముఖాభినయం, అద్భుత ఆహార్యంతో రక్తి కట్టించే సీనియర్ నటి ఆ పాత్రకు అవసరం. నితీష్ జీ ఆలోచన ఆ కోవలోనే సాగింది. అందుకే సాక్షి తన్వర్ లాంటి సీనియర్ బుల్లితెర నటిని ఎంపిక చేసుకున్నాడు. అయినా రామాయణంలో మండోదరి నటన కంటే రావణుడిగా యష్ నటన ఎలా ఉంటుంది? అన్నది చాలా కీలకం. మండోదరి పాత్ర చాలా పరిమితంగా ఇలా వచ్చి వెళ్లేదిగా ఉండొచ్చు. అందువల్ల అభిమానులు తమ అవివేకాన్ని ప్రదర్శించడం తగదని ఒక సెక్షన్ విశ్లేషిస్తోంది. సాక్షి తన్వర్ ఇప్పటికే ప్రీప్రిపరేషన్ వర్క్ లో బిజీగా ఉన్నారని తెలిసింది.
ఆదిపురుష్ విషయంలో దర్శకుడు ఓంరౌత్ చేసిన తప్పిదాలను ఇప్పుడు పౌరాణిక, జానపద కథలు హిస్టారికల్ కథలు ఎంపిక చేసుకుని సినిమాలు తీసే దర్శకులు గుర్తు చేసుకుంటున్నారు. అలాంటి కథలను ఎంపిక చేసుకుంటే పాత్రధారులు మాట్లాడే భాష, కాస్ట్యూమ్స్, కాలాదులతో పాటు ఆర్టిస్టుల ఎంపికల విషయంలో రాజీకి రాకూడదు. నటీనటుల సీనియారిటీ కూడా కీలకం. అందువల్ల గ్లామర్ కోసం పాకులాట తగదనేది గమనార్హం. దర్శకుడు నితీష్ తివారీ సుదీర్ఘ అనుభవం ఉన్న దర్శకరచయితగా ప్రీప్రొడక్షన్ దశలో రామాయణం కోసం చాలా సమయం వెచ్చించి మంచి ఆర్టిస్టులను ఎంపిక చేసుకుంటున్నారు.