'సలార్ -2'కి ఆ తప్పు చేయరా?
అయితే సలార్ -2 విషయంలో ఆ తప్పిదాలు మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంది. అలా చేస్తేనే బాక్సాఫీస్ వద్ద కొన్ని లెక్కలు సరితూగడానికి అవకాశం ఉంటుంది.
'సలార్' సీజ్ ఫైర్ 1000 కోట్ల వసూళ్ల టార్గెట్ తో రిలీజ్ అయింది. ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్...ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ ఇమేజ్ నేపథ్యంలో మొదటి భాగంతోనే సలార్ 1000 కోట్లు రాబడుతుందని అంచనా వేసారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఆ లెక్క తప్పింది. 700 కోట్ల వసూళ్లతోనే సరిపోట్టుకోవాల్సి వచ్చింది. అందులోనూ వాస్తవం ఎంత? అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈసినిమాపై నెగిటివ్ రిపోర్డ్ కూడా ఉంది. స్టోరీ ఏంటి? అన్నది అర్ధం కాలేదని...స్టోరీ ముందుగానే రివీల్ చేస్తే బాగుండేదని కొంత మంది అభిప్రాయపడ్డారు.
అలాగే ప్రభాస్ పాత్రలో యాక్షన్ ని పెద్దగా హైలైట్ చేయలేదు. ఇలా కొన్ని రకాల విమర్శలు తెరపైకి వచ్చాయి. ఇదంతా ఒక ఎత్తైతే...రిలీజ్ కి ముందు పెద్దగా ప్రచారం చేయకపోవడం కూడా సినిమాకి మైనస్ గా మారిందన్నది మరికొంత మంది అభిప్రాయం. కేవలం ప్రచార చిత్రాలతో సరిపెట్టారు తప్ప ఇలాంటి ఈవెంట్లు లేకుండానే రిలీజ్ చేసారు. ఒకటి..రెండు ఇంటర్వ్యూలు తప్పితే ప్రచారం పరంగా దేశ వ్యాప్తంగా ఒక్క చోట కూడా ఈవెంట్ నిర్వహిం చలేదు. అదీ కూడా సినిమా వసూళ్లపై ప్రతికూల ప్రభావం చూపించిందని వినిపిస్తుంది.
ఈ సినిమా హిందీ వసూళ్లు వీక్ గానే ఉన్నాయి. 'డంకీ 'సినిమాకి నెగిటివ్ రిపోర్ట్ వచ్చినా వసూళ్లు ఏమంత మెరుగవ్వలేదు. ఆ రకంగా చిత్ర యూనిట్ సీజ్ ఫైర్ విషయంలో చిన్నపాటి తప్పిదాలు చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సలార్ -2 విషయంలో ఆ తప్పిదాలు మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంది. అలా చేస్తేనే బాక్సాఫీస్ వద్ద కొన్ని లెక్కలు సరితూగడానికి అవకాశం ఉంటుంది. అసలైన యాక్షన్ రెండవ భాగంలో ఉంటుందని తెలుస్తోంది.
అందుకు తగ్గట్టు సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాలి. నెగిటివ్ రిపోర్ట్ ఎక్కడ వచ్చిందో? అది సరిదిద్దుకోవాలి. లేదంటే నష్టం ఊహించని విధంగా ఉండనూ ఉండొచ్చు. అందుకే కల్కి 2898 విషయంలో నాగ్ అశ్విన్ అన్నిరకాల జాగ్రత్తలతో సినిమా ప్రేక్షకుల్లోకి తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు. వీలైనంత వరకూ అన్ని పరిశ్రమల్లోకి సినిమాని బలంగా తీసుకెళ్లాలని..ఆయా చోట్ల ఈవెంట్లు నిర్వహించాలని ప్లాన్ చేస్తు న్నారుట.' కల్కీ' తర్వాతే 'సలార్ -2' రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రశాంత్ నీల్ తగు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.