సలార్ 2: మళ్ళీ ఇదెక్కడి ట్విస్ట్ డార్లింగ్?

ఇప్పుడు వినిపిస్తున్న మరో షాకింగ్ టాక్ ఏమిటంటే.. "సలార్ 2" ప్రాజెక్ట్ తాత్కాలికంగా నిలిపివేయబడిందని, భవిష్యత్తులో అసలు జరుగకపోవచ్చని తెలుస్తోంది.

Update: 2024-05-25 07:46 GMT

ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రావాల్సిన "సలార్" సీక్వెల్ శౌర్యంగాపర్వం ప్రాజెక్టుపై అంచనాలు హై రేంజ్ లో ఉన్నప్పటికీ మేకర్స్ మాత్రం సౌండ్ చేయడం లేదు. వేసవి తర్వాత షూటింగ్ ప్రారంభమవుతుందని వార్తలు వినిపించాయి. అంతకుముందు సినిమాలో నటించిన యాక్టర్స్ కూడా త్వరలోనే స్టార్ట్ కాబోతున్నట్లు ప్రతీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

అయితే హఠాత్తుగా దర్శకుడు మరొక ప్రాజెక్టులోకి వెళ్లడం ఆగస్టు లో షూటింగ్ అనడం డార్లింగ్ ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేశాయి. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ఓ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది ప్రారంభం కావాల్సి ఉందని, అందుకే ఆయన "సలార్ 2"ని తరువాత చేయవచ్చని రకరకాల కథనాలు వచ్చాయి.

ఎన్టీఆర్ ప్రాజెక్ట్ షూటింగ్ ఆగస్టులో ప్రారంభమవుతుందని, మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయని తెలిసింది. ఇప్పుడు వినిపిస్తున్న మరో షాకింగ్ టాక్ ఏమిటంటే.. "సలార్ 2" ప్రాజెక్ట్ తాత్కాలికంగా నిలిపివేయబడిందని, భవిష్యత్తులో అసలు జరుగకపోవచ్చని తెలుస్తోంది. ఈ నిర్ణయానికి కారణం ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ మధ్య సృజనాత్మక విభేదాలు ఉన్నాయని ఒక టాక్ వైరల్ అవుతోంది.

ప్రభాస్ ప్రస్తుతం "కల్కి 2898 AD" చిత్రీకరణను పూర్తి చేసి, మరుతి దర్శకత్వంలో "రాజా సాబ్" ప్రాజెక్ట్‌లో నిమగ్నమయ్యారు. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో "స్పిరిట్" అనే సినిమా కూడా ఆయన లైనప్‌లో ఉంది. హను రాఘవపూడి దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్‌కు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, త్వరలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు.

ఈ నేపధ్యంలో "సలార్ 2" నిలిపివేయబడడం ప్రభాస్‌కు పెద్ద సమస్య కాకపోవచ్చు. ఆయన వద్ద ఇప్పటికే పలు పాన్-ఇండియన్ ప్రాజెక్ట్స్ ఉండటంతో, మరిన్ని ఆసక్తికరమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ సినిమా కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మొత్తానికి, "సలార్ 2" కు బ్రేక్ పడలేదని అసలు ఉండకపోవచ్చని అన్నట్లు టాక్ మొదలైంది. డైరెక్టర్ విజన్ కు తగ్గట్టుగా హీరో కూడా ఒప్పుకోలేదని అన్నట్లు మరికొన్ని గాసిప్స్ వస్తున్నాయి. ఏది ఏమైనా ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ ఇద్దరు తమ తమ కొత్త ప్రాజెక్ట్స్‌లో బిజీ అయిపోయారు, వీరి భవిష్యత్ ప్రాజెక్ట్స్ పై ప్రేక్షకుల్లో కొత్త ఆశలు కలిగిస్తున్నాయి. "సలార్ 2" మళ్ళీ సెట్స్ పైకి వస్తుందా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత లేనప్పటికీ, ఈ ఇద్దరు సూపర్‌స్టార్స్ తమ తదుపరి ప్రాజెక్ట్స్‌ మాత్రం క్రేజీగా ఉండబోతున్నాయి.

Tags:    

Similar News