సలార్ కలెక్షన్స్‌.. ఫస్ట్ డే ఎంతంటే?

ప్రపంచ వ్యాప్తంగా సలార్ మూవీ తొలి రోజు రూ.175 కోట్లకుపైగా గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి

Update: 2023-12-23 07:13 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం సలార్. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22వ తేదీన ఈ సినిమా విడుదలై హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన సలార్ సందడే కనిపిస్తోంది. చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని సెంటర్లలో హౌస్ ఫుల్ వసూళ్లతో రికార్డులను క్రియేట్ చేస్తోంది సలార్.

ప్రపంచ వ్యాప్తంగా సలార్ మూవీ తొలి రోజు రూ.175 కోట్లకుపైగా గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇండియాలోనే ఓపెనింగ్ రోజు రూ.95 కోట్లు సాధించినట్లు సమాచారం. ఈ ఏడాదిలో మొదటి రోజు బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ ఇచ్చిన చిత్రంగా సలార్‌ చిత్రం రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

ఆ లిస్ట్ లో సలార్ తర్వాత స్థానంలో దళపతి విజయ్ నటించిన లియో, ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్ చిత్రాలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు రూ.140 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టాయి. దీంతో ఒకే సంవత్సరంలో రెండు సినిమాలకు మొదటి రోజే రూ.100కోట్ల కలెక్షన్లు సాధించిన ఇండియన్ హీరోగా ప్రభాస్‌ రికార్డు సృష్టించారు.

ఇప్పటి వరకు మొదటి రోజు అత్యధిక ఓపెనింగ్స్‌ కలెక్షన్స్‌ సాధించిన చిత్రంగా రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మాత్రమే ఉంది. ఈ సినిమాకు తొలి రోజు వచ్చిన కలెక్షన్స్‌ రూ. 223 కోట్ల రికార్డ్‌ అలానే ఉంది. ఆ తర్వాత కేజీఎఫ్‌-2 రూ.165 కోట్ల రికార్డ్‌ను సలార్‌ దాటేసింది. దీంతో మొదటి రోజు బిగ్గెస్ట్‌ కలెక్షన్స్‌ సాధించిన సినిమాల లిస్ట్ లో సలార్‌ రెండో స్థానానికి చేరుకుంది. ఈ రెండు చిత్రాలు సౌత్‌ ఇండియా నుంచే ఉండటం విశేషం.

బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన మూడు సినిమాలు ప్రేక్షకుల ఆదరణను పొందలేకపోయాయి. అందుకే ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్ పైనే పెట్టుకున్నారు. దీంతో మొదటి రోజే ఈ సినిమా చూడాలని చాలా మంది ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఎగబడ్డారు. దీని వల్ల ప్రీ బుకింగ్, ఫస్ట్ డే కలెక్షన్స్‌పై పాజిటివ్ ప్రభావం పడిందని సినీ పండితులు చెబుతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఓపెనింగ్ రోజే రూ.70 కోట్లను కలెక్ట్ చేసింది సలార్. ఈ మూవీలో దేవగా ప్రభాస్, వరద రాజ మన్నార్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్, రాజమన్నార్‌గా జగపతి బాబు, ఆద్యగా శ్రుతి హసన్ కనిపించారు.

Tags:    

Similar News