'సలార్' వసూళ్లు 'పుష్ప-2' కి వీక్ గా మారుతున్నాయా?
`సలార్` సీజ్ పైర్ బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 500 కోట్ల క్లబ్ లో చేరింది.
`సలార్` సీజ్ పైర్ బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 500 కోట్ల క్లబ్ లో చేరింది. పుల్ రన్ లో ఈ సినిమా ఎంత వసూళ్లు సాధింస్తుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే US బాక్సాఫీస్ వద్ద $8.2 మిలియన్ (65 కోట్లు) వసూళ్లని సాధించి రికార్డు సృష్టించింది. `బాహుబ లి` ప్రాంచైజీ తర్వాత ఆమెరికా నుంచి భారీ వసూళ్లు సాధించిన చిత్రం ఇదే కావడం విశేషం.
ఇక తెలుగు వెర్షన్ వసూళ్లు భారీగానే ఉన్నాయి. ఇంతవరకూ బాగానే ఉంది. మరి మిగతా వెర్షన్ల పరిస్థితి ఏంటి? అంటే! అసంతృప్తిగానే కనిపిస్తుంది. `సలార్` హిందీ వెర్షన్ దాదాపు $1.5 మిలియన్ వసూలు చేసింది. ప్రభాస్ రేంజ్ కిది చాలా చిన్న ఫిగర్. పోటీగా `డంకీ` సహా ఆయన వరుస వైఫల్యాలు `సలార్` పై కాస్త ప్రభావాన్ని చూపించినట్లు కనిపిస్తోంది. అలాగే కన్నడ.. తమిళ్.. మలయాళం వెర్షన్లు కూడా తక్కువ సంఖ్యలోనే బాక్సాఫీస్ నెంబర్లు కనిపిస్తున్నాయి.
ప్రభాస్ స్టామినా మొత్తం అంచనా వేస్తే? 500 కోట్లు రావడం ఏంటి? 800 నుంచి 1000 కోట్లైనా ఉండాలి? అన్నది ట్రేండ్ అంచనా. కానీ ఆ లెక్క కు చాలా దూరంగా ఉంది సలార్. ఇప్పుడిదే టెన్షన్ మిగతా సినిమాల్లో గుబులు పుట్టిస్తుంది.` సలార్` వసూళ్ల ప్రభావం `పుష్ప-2` పై పుడుతుందని గెస్సింగ్స్ తెరపైకి వస్తున్నాయి. `పుష్ప 2` యూఎస్ ప్రీ రిలీజ్ బిజినెస్ 50 కోట్లలోపే కోట్ చేస్తున్నారుట. అంతకు మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వడానికి ఆసక్తి చూపించడం లేదని టాక్ వినిపిస్తుంది.
మేకర్స్ మాత్రం 100 కోట్లు కోట్ చేస్తున్నా! అందులో సగానికి డిస్ట్రిబ్యూటర్లు కోట్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. 50 కోట్లు మించి విక్రయిస్తే అది రిస్క్ జోన్ లో ఉన్నట్లేనని బయ్యర్లు భావిస్తున్నారుట. ఈ నేపథ్యంలో మేకర్స్ ఓవర్సీస్ మార్కెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అదే సలార్ వసూళ్లు గనుక ఇతర లోకేషన్లలో బలంగా ఉండి ఉంటే? పుష్ప-2కి ఈ సమస్య వచ్చేది కాదని గెస్సింగ్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ లెక్క ఎలా సరితూగుతుందన్నది చూడాలి.