సలార్.. కాస్త తగ్గితే బెటరేమో

రెబల్ స్టార్ ప్రభాస్ - కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన 'సలార్' డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది.

Update: 2023-12-24 18:42 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ - కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన 'సలార్' డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది. రిలీజ్ అయిన మొదటి రోజే రూ.178 కోట్ల గ్రాస్ అందుకొని ఈ ఇయర్ హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న మూవీగా నిలిచింది. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోను అదరగొడుతున్న సలార్ సినిమా విషయంలో తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ కి ఓ మేజర్ ఇష్యూ ఉంది.

అదే టికెట్ రేట్లు పెంచడం. సలార్ నిర్మాణ సంస్థ అయిన హోంబలే ఫిలిమ్స్ రిలీజ్ కు ముందు టికెట్ రేట్ల పెంపు కోసం రెండు తెలుగు రాష్ట్రాలకు దరఖాస్తు చేసి వాళ్ళ నుండి అనుమతి తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలో టికెట్ రేట్లు భారీగా పెంచగా, ఏపీలో లో-క్లాస్ టికెట్ రేట్లు ఎక్కువ ఉండడంతో ప్రేక్షకులు సినిమా చూడకుండా అవుతున్నారు. వారం, పది రోజుల పాటు పెరిగిన రేట్ల తోనే సినిమాను చూడాలంటే సామాన్య ఆడియన్స్ కి అది చాలా కష్టం.

దీన్ని పరిగణలోకి తీసుకొని అయినా సలార్ మేకర్స్ వీక్ డేస్ నుంచి టికెట్ ధరలు తగ్గిస్తే బాగుంటుంది. ఇటీవల ఎక్కువ టికెట్ రేట్లతో విడుదలైన చాలా సినిమాలు వీక్ డేస్ లో బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ నెంబర్స్ అందుకోవడంలో విఫలమయ్యాయి. ఇప్పుడు సలార్ కి కూడా అది జరిగే అవకాశం ఉంది. కాబట్టి సలార్ మేకర్స్ ఇప్పటికైనా టికెట్ ధరలను తగ్గించే ఆలోచన చేయాలని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.

డిసెంబర్ 22న రిలీజ్ అయిన సలార్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను సాధిస్తుంది. అదే ఊపును కొనసాగించాలంటే టికెట్ ధరలను తగ్గిస్తే మంచిది. రిలీజ్ కి ముందే ఆడియన్స్ లో భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ అందుకున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం టికెట్ ధరల కారణంగా ఆశించిన స్థాయి వసూళ్లను రాబట్టలేకపోతోంది.

అందుకే నిర్మాతలు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు తగ్గిస్తే కచ్చితంగా సినిమాకి భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో సలార్ మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. రెండు భాగాలుగా రాబోతున్న సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ లో ప్రభాస్, పృధ్విరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శృతి హాసన్, శ్రీయా రెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి భువన గౌడ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరించారు.

Tags:    

Similar News