'సలార్', 'డంకీ'లపై కరోనా ఎఫెక్ట్.. ఛాన్సే లేదు.. కానీ?

గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 614 కేసులు నమోదు అవ్వగా ఇప్పటివరకు 2300 కేసులకు పైగా నమోదయినట్లు తెలిసింది

Update: 2023-12-20 14:07 GMT

సినిమా పరిశ్రమపై కరోనా ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో అందరికీ తెలిసిందే. ఈ మహమ్మారి వల్ల సుమారు రెండు ఏళ్ల పాటు సినిమా వాళ్లకి ఏ పని దొరకలేదు. షూటింగ్లు, సినిమా రిలీజ్ లు లేక ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడ్డారు. 2020, 2021 సినిమా పరిశ్రమకు గడ్డుకాలంగా నిలిచింది. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మరోసారి ఇండియాలో కోవిడ్ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి.

గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 614 కేసులు నమోదు అవ్వగా ఇప్పటివరకు 2300 కేసులకు పైగా నమోదయినట్లు తెలిసింది. సరిగ్గా ఇదే సమయంలో థియేటర్లో రెండు పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో టాలీవుడ్ నుంచి సలార్, బాలీవుడ్ నుంచి డంకీ సినిమాలు రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

ఇలాంటి తరుణంలో మళ్లీ కరోనా కేసులు ఎక్కువ అవ్వడంతో ఇది కాస్త సలార్, డంకీ లపై ఎఫెక్ట్ చూపిస్తుందేమో అని కొందరు అంటున్నారు. కానీ కరోనా ఈ సినిమాలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో కరోనాని జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. కేసులు ఎక్కువవుతున్నాయని తెలిస్తే మాస్కులు ధరించడం, చేతులకు సానిటైజర్, సోషల్ డిస్టెన్స్ అంటూ జనాలందరూ ముందస్తు జాగ్రత్తలోనే ఉంటారు.

అంతెందుకు కరోనా బాగా వ్యాప్తి చెందుతున్న సమయంలోనే మాస్కులు వేసుకొని మరీ థియేటర్స్ లో సినిమాలు చూశారు ఆడియన్స్. ఈసారి కూడా కరోనాకి తగిన జాగ్రత్తలు పాటిస్తే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ఈ పెద్ద సినిమాల రచ్చలో కోవిడ్ కేసులు ఎక్కువయ్యే ఛాన్సులు అయితే ఉండొచ్చు. ఎందుకంటే పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే థియేటర్స్ లో ఏ రేంజ్ లో రచ్చ ఉంటుందో తెలిసిందే.

అలాంటి సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోతే పాజిటివ్ కేసులు మరింత పెరగడం ఖాయమని చెప్పొచ్చు. ఇక సలార్ విషయానికొస్తే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఇప్పటికే సలార్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో డంకీ కంటే సలార్ కే ఎక్కువ బుకింగ్స్ నమోదవుతున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Tags:    

Similar News