సలార్ : 'బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడు...?

ప్రభాస్, రాజమౌళి కాంబోలో రూపొందిన బాహుబలి 1 రిలీజ్ తర్వాత ఎవరి నోట చూసినా, ఎవరు మాట్లాడుకున్నా కూడా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు ప్రశ్న.

Update: 2023-12-21 06:34 GMT

ప్రభాస్, రాజమౌళి కాంబోలో రూపొందిన బాహుబలి 1 రిలీజ్ తర్వాత ఎవరి నోట చూసినా, ఎవరు మాట్లాడుకున్నా కూడా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు ప్రశ్న. దేశ ప్రధాని మొదలుకుని ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రశ్న కోసం సమాధానం వెతికిన దాఖలాలు ఉన్నాయి.

రెండు సంవత్సరాల పాటు రాజమౌళి జాతీయ స్థాయిలో ఆ ప్రశ్న గురించి, బాహుబలి 2 గురించి చర్చ జరిగేలా చేశాడు. అత్యంత విశ్వాస పాత్రుడు అయిన కట్టప్ప ఎందుకు బాహుబలి ని చంపాడు అనేది చిన్న పాయింట్ కూడా లీక్ అవ్వకుండా రెండో పార్ట్‌ రిలీజ్ అయ్యేంత వరకు సస్పెన్స్ ని కొనసాగించడం లో జక్కన్న సూపర్ సక్సెస్ అయ్యాడు.

ఇప్పుడు అదే తరహాలో సలార్ సినిమా మొదటి పార్ట్ ముగింపు లో ఆసక్తికర విషయాన్ని చూపించి సస్పెన్స్‌ క్రియేట్ చేస్తారట. బాహుబలి 2 కోసం మొత్తం జాతి ఎలా అయితే వెయిట్ చేసిందో అదే విధంగా సలార్ 2 కోసం ప్రేక్షకులు ఎదురు చూసే విధంగా సలార్ 1 లో దర్శకుడు ప్రశాంత్‌ నీల్ ఆసక్తికర సస్పెన్స్‌ ఎలిమెంట్‌ ను పెట్టినట్లుగా సమాచారం అందుతోంది.

మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సలార్‌ 1 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ప్రభాస్‌, పృథ్వీరాజ్ సుకుమారన్‌ లు ఈ సినిమాలో క్లోజ్ ఫ్రెండ్స్ గా కనిపిస్తారు. పరిస్థితుల కారణంగా ఇద్దరు కూడా బద్ద శత్రువులు గా మారుతారు. అలా ఎందుకు మారారు అనేది కథలో ఆసక్తికర విషయంగా చెబుతున్నారు.

సినిమాలో సెకండ్‌ హాఫ్‌ అద్భుతంగా ఉంటుందని మేకర్స్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. సెకండ్‌ పార్ట్‌ లో కూడా అత్యంత కీలకమైన కథ ను చెప్పబోతున్నామని సలార్ 1 క్లైమాక్స్ లో చెప్పబోతున్నారట. మొత్తానికి సలార్ 1 వచ్చిన తర్వాత సలార్ 2 పై అంచనాలు భారీగా పెరుగుతాయని అంటున్నారు.

Tags:    

Similar News