సలార్.. తెలుగు డీల్స్ తక్కువే..
సీడెడ్, ఆంధ్రా కలుపుకొని 100 కోట్ల వరకు బిజినెస్ చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు 75 నుంచి 80 కోట్ల మధ్యలో సెట్ అయ్యిందంట
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి రిలీజ్ కి రెడీ అవుతోన్న మూవీ సలార్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆదిపురుష్ లాంటి డిజాస్టర్ తర్వాత వస్తోన్న సినిమా కావడంతో ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు. కచ్చితంగా అందరి అంచనాలని సలార్ మూవీ అందుకుంటుందని డార్లింగ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా ఒక్క తెలుగు తప్ప మిగిలిన అన్ని భాషలకి థీయాట్రికల్ బిజినెస్ కంప్లీట్ అయ్యింది. అయితే తెలుగులో నిర్మాత విజయ్ కిరంగదూర్ 200 కోట్ల వరకు బిజినెస్ చేయాలని భావించాడు. కచ్చితంగా అంత వస్తుందని అనుకున్నాడు. అయితే డిస్టిబ్యూటర్స్ నుంచి నిర్మాత కోట్ చేసిన మొత్తం ఇవ్వడానికి ఆసక్తి చూపించలేదు. దీనికి కారణం ఆదిపురుష్ తో పడిన ఎఫ్జెక్ట్ కూడా.
ఈ నేపథ్యంలో నిర్మాత కాస్త వెనక్కి తగ్గి రైట్స్ తగ్గించి ఆఫర్ చేసారంట. ముందుగా అనుకున్న దానికంటే 30 నుంచి 40 కోట్ల తక్కువగానే తెలుగులో సలార్ బిజినెస్ డీల్స్ క్లోజ్ అయ్యాయంట. నైజాం రైట్స్ ని ముందుగా 75 కోట్లకి అమ్మాలని నిర్మాత భావించాడు. ఫైనల్ గా 60 కోట్ల దగ్గర డీల్ క్లోజ్ అయ్యిందంట. దిల్ రాజు నైజాం రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
సీడెడ్, ఆంధ్రా కలుపుకొని 100 కోట్ల వరకు బిజినెస్ చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు 75 నుంచి 80 కోట్ల మధ్యలో సెట్ అయ్యిందంట. మొత్తం ఓవరాల్ గా తెలుగు స్టేట్స్ బిజినెస్ 160 నుంచి 165 కోట్ల మధ్యలో క్లోజ్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. నిర్మాత ఎక్స్ పెక్ట్ చేసినదానికంటే తక్కువగానే ఈ డీల్స్ సెట్ అయ్యాయని అర్ధమవుతోంది.
అయితే సలార్ మూవీ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని. ఆదిపురుష్ లాంటి రిజల్ట్ రిపీట్ కాదని డిస్టిబ్యూటర్స్ కూడా బలంగా నమ్ముతున్నారు. దానికి కారణం ప్రశాంత్ నీల్ విజన్ కూడా. కేజీఎఫ్ సిరీస్ ని ఏ రేంజ్ లో ఎస్టాబ్లిష్ చేశారో తెలిసిందే. అంతకు మించి సలార్ ఉండబోతోందని భావిస్తున్నారు.