మౌనం వీడిన సలార్ టీమ్.. ఇదిగో బ్యాడ్ న్యూస్!

అయితే వార్తలు ఎన్ని వస్తున్నా కూడా నిన్నటి వరకు మౌనంగానే ఉన్న నిర్మాణ సంస్థ హోంబెల్ ప్రొడక్షన్స్ మొత్తానికి మౌనం వీడింది.

Update: 2023-09-13 04:26 GMT

ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్యాడ్ లక్ ఏమిటో గాని మొదట్లో పాజిటివ్ అంచనాలు పెంచుకుంటున్న ప్రతి సినిమా కూడా చివరికి వచ్చేసరికి ఏదో ఒక కారణం చేత మళ్లీ నెగటివ్ వైబ్రేషన్స్ ను క్రియేట్ చేసుకుంటుంది. మొదటినుంచి కూడా సలార్ సినిమాపై మాస్ ఫ్యాన్స్ లో అయితే మామూలు అంచనాలు లేవు. కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను అంచనాలకు మించి తెరపైకి తీసుకువస్తాడు అని తప్పకుండా అతను బాహుబలి స్థాయిలో ప్రభాస్ కు హిట్ అయితే ఇస్తాడు అని రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో నమ్మకం పెట్టుకున్నారు.


అయితే ఈ సినిమా విడుదల విషయంలోనే ఇంకా సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. సినిమాను సెప్టెంబర్ 28వ తేదీన గ్రాండ్ గా విడుదల చేస్తామని గత ఏడాది నుంచి చెప్పుకుంటూ వస్తున్న చిత్ర యూనిట్ సభ్యులు మొత్తానికి సినిమాను అయితే వాయిదా వేసేశారు. ఈపాటికి సినిమా ప్రమోషన్స్ తో హడావిడి చేస్తారు అనుకుంటే ఊహించని విధంగా ట్విస్ట్ అయితే ఇచ్చారు.

గత వారం రోజులుగా ఈ సినిమా వాయిదా పడుతుంది అని సిజి వర్క్ ఆలస్యం అవుతుంది అని అలాగే ఓటీటీ బిజినెస్ డీల్ క్లోజ్ కాలేదు అని ఇలా చాలా రకాల కారణాలు వైరల్ అయ్యాయి. అయితే వార్తలు ఎన్ని వస్తున్నా కూడా నిన్నటి వరకు మౌనంగానే ఉన్న నిర్మాణ సంస్థ హోంబెల్ ప్రొడక్షన్స్ మొత్తానికి మౌనం వీడింది.

ఈ విధంగా అయితే వివరణ ఇచ్చారు. 'సలార్ కోసం మీ అచంచలమైన మద్దతును మేము అభినందిస్తున్నాము. అయితే ఊహించలేని పరిస్థితుల కారణంగా సెప్టెంబర్ 28 విడుదల చేయాలనుకున్న సలార్ ని వాయిదా వేయాల్సి వస్తోంది. మంచి సినిమా అనుభవాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. కాబట్టి, ఈ నిర్ణయం జాగ్రత్తగా తీసుకోబడిందని దయచేసి అర్థం చేసుకోండి.

మా టీమ్ అత్యున్నత ప్రమాణాలను అందుకోవడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. కొత్త విడుదల తేదీ నిర్ణీత సమయంలో వెల్లడి చేయబడుతుంది. సలార్ తుది మెరుగులు దిద్దుతున్నప్పుడు మీ సపోర్ట్ అవసరం. ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైనందుకు ధన్యవాదాలు.. అంటూ నిర్మాణ సంస్థ వివరణ ఇచ్చింది. అయితే మళ్లీ ఎప్పుడు ఈ సినిమా ఉంటుంది అనే విషయంలో మాత్రం సరైన క్లారిటీ ఇవ్వలేదు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే సినిమా ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్లో రావచ్చు అని తెలుస్తోంది.

Tags:    

Similar News