సలార్.. అక్కడ మాత్రం ఊహించని రిలీజ్
చాలా ప్రాంతాలలో మొదటి రోజు అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ కనిపిస్తున్నాయి
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా సలార్. డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషలలో మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి. చాలా ప్రాంతాలలో మొదటి రోజు అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ కనిపిస్తున్నాయి
శృతి హాసన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు ప్రతినాయకులుగా కనిపించబోతున్నారు. బాబీ సింహా, టిను ఆనంద్, శ్రియా రెడ్డి లాంటి స్టార్ క్యాస్టింగ్ కూడా మూవీలో ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయినా ట్రైలర్స్ రెండు సినిమా మీద అంచనాలు పెంచేశాయి. దీంతో భారీ ఎత్తున టికెట్ ల కోసం ఫ్యాన్స్, సాధారణ ప్రేక్షకులు ఎగబడుతున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. యూఎస్ఏలో ఏకంగా 2500 ప్రీమియర్ షోలని తెలుగు ప్రేక్షకుల కోసం ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. హాలీవుడ్ మూవీ ఆక్వా మెన్ పోటీని తట్టుకొని సలార్ సినిమా కోసం ఈ స్థాయిలో థియేటర్స్ కేటాయించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ప్రీమియర్ షోలు ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీకి పడలేదని తెలుస్తోంది.
ఇక సలార్ కంటే ఒక రోజు ముందుగా డంకీ సినిమా రిలీజ్ అవుతోంది. షారుఖ్ ఖాన్ లాంటి బిగ్ స్టార్ ఉన్న కూడా అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా సలార్ కంటే తక్కువగానే బజ్ ఉంది. నార్త్ ఇండియాలో సైతం సలార్ కోసం ఆడియన్స్ ఎక్కువ ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ ప్రీమియర్స్ సందడి చూస్తుంటే కచ్చితంగా యూఎస్ఏలో సలార్ రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.
అలాగే ప్రపంచ వ్యాప్తంగా లియో మూవీ ఓపెనింగ్ డే రికార్డ్ ని సలార్ బ్రేక్ చేయడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన కూడా మూవీకి రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వస్తాయని డంకీ మూవీ నిలబడే ఛాన్స్ ఉండకపోవచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు.