యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ సలార్. ఈ మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ కి రెడీ అవుతోంది. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ మొదటి పార్ట్ కి సంబందించిన రిలీజ్ పై చిత్ర యూనిట్ ఫోకస్ పెట్టింది. ఏకంగా 400 కోట్ల భారీ బడ్జెట్ తో సలార్ సిరీస్ ని నిర్మించినట్లు తెలుస్తోంది. హోంబలే ఇప్పటికే మూవీపై బిజినెస్ స్టార్ట్ చేసేసింది.
ఇదిలా ఉంటే రీసెంట్ గా సలార్ టీజర్ ని ప్రశాంత్ నీల్ ప్రేక్షకులకి అందించారు. అయితే ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉన్న అభిమానులు అంతకుమించి ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అయితే రిలీజ్ కి ముందు సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేయడం కరెక్ట్ కాదని ప్రశాంత్ నీల్ భావించి సింపుల్ గా టీజర్ ని వదిలారు. ఈ నెలలో ఫస్ట్ సింగిల్ ని లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
తరువాత ఆగష్టు లో మంచి డేట్ చూసుకొని ట్రైలర్ ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆటోమేటిక్ గా ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతాయి.
సినిమాకి కూడా మంచి బూస్టింగ్ వస్తుంది. అందుకే ఆగష్టు ఆఖరులో ట్రైలర్ ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అయిది దాంట్లో కూడా కాన్సెప్ట్ పూర్తిగా రివీల్ చేయకుండా ప్రెజెంట్ చేయాలని అనుకుంటున్నారంట.
అలాగే సెప్టెంబర్ లో సెకండ్ సింగిల్ ని విడిచిపెట్టాలని ప్లాన్ చేస్తున్నారంట. సెప్టెంబర్ 28న రిలీజ్ కాబట్టి పక్కా ప్లాన్ తో సలార్ ని రెడీ చేస్తున్నారు. ఆదిపురుష్ కి తగిలిన ఎఫెక్ట్ సలార్ పై పడకుండా ప్రశాంత్ నీల్ మాత్రం పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట.
రిలీజ్ వరకు ఈ సినిమాకి సంబంధించి మెయిన్ కంటెంట్ ఏంటనేది రివీల్ చేయకూడదనే ఆలోచనతోనే చిత్ర యూనిట్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి సలార్ సినిమా విషయంలో ప్రశాంత్ నీల్ వెళ్తోన్న ఈ డిఫరెంట్ అప్రోచ్ ఎంత వరకు సినిమాకి హైప్ తీసుకొస్తుంది అనేది చూడాలి.