ఇంకోసారి ఆ డుంకితో పోల్చకండి బాబు
అప్ కమింగ్ రిలీజ్ కాబోయే సినిమాలలో బుక్ మై షో మోస్ట్ ఇంటరెస్ట్ చిత్రాల జాబితాలో సలార్ టాప్ లో ఉంది. ఈ సినిమా కోసం 3 లక్షల 62 వేల 8 వందల మది ప్రత్యేకంగా ఆసక్తి చూపిస్తున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధం అవుతున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లోకి రానుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిద్ధమవుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే సలార్ కి పోటీగా అదే రోజు షారుఖ్ ఖాన్ డుంకీ మూవీ కూడా రిలీజ్ కాబోతోంది.
ఈ ఏడాది రెండు వరుస హిట్స్ తో మంచి జోరు మీద ఉన్న షారుఖ్ ఖాన్ ఓ వైపు ఆదిపురుష్ లాంటి డిజాస్టర్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తోన్న సలార్ మరోవైపు పోటీ పడుతున్నాయి. కామన్ గా ఎవరైనా షారుఖ్ ఖాన్ డుంకీ మూవీ రిలీజ్ కోసం ఎక్కువ మంది ఆసక్తి చూపించే అవకాశం ఉందని భావిస్తారు. అయితే సరైన సక్సెస్ లేకపోయిన డార్లింగ్ ప్రభాస్ మీద ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ మాత్రం తారాస్థాయిలో ఉన్నాయని చెప్పాలి.
అప్ కమింగ్ రిలీజ్ కాబోయే సినిమాలలో బుక్ మై షో మోస్ట్ ఇంటరెస్ట్ చిత్రాల జాబితాలో సలార్ టాప్ లో ఉంది. ఈ సినిమా కోసం 3 లక్షల 62 వేల 8 వందల మది ప్రత్యేకంగా ఆసక్తి చూపిస్తున్నారు. రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తమ ఇంట్రెస్ట్ తెలియజేశారు. దీని తర్వాత స్థానంలో డుంకీ పట్ల కేవలం 76 వేల 7వందల మది మాత్రమే ఇంటరెస్టింగ్ చూపించారు.
తరువాత యానిమల్ సినిమాపై 39 వేల 8 వందల మది ఆసక్తి చూపించడం విశేషం. ఈ మూడు చిత్రాలు డిసెంబర్ నెలలోనే రిలీజ్ కాబోతున్నాయి. ప్రేక్షకుల ఆసక్తి అత్యధికంగా సలార్ సినిమాపైనే ఉందని బుక్ మై షో ఇంట్రెస్ట్ ల ద్వారా స్పష్టం అయ్యింది. సలార్ కి పోటీగా డుంకీ మూవీ రిలీజ్ చేస్తే థియేటర్స్ ఇష్యూ కచ్చితంగా ఉంటుంది.
అందుకే షారుఖ్ ఖాన్ అండ్ కో రిలీజ్ డేట్ వాయిదా వేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారంట. ప్రస్తుతానికి అయితే డుంకీ రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని ప్రకటనలు అయితే ఇస్తున్నారు. కాని సలార్ మానియా ముందు డుంకీ నిలబడే అవకాశం లేదని బిటౌన్ లో కూడా సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజ్ కుమార్ హిరాణీ పునరాలోచనలో పడ్డారని టాక్ వినిపిస్తోంది.