బెదిరింపుల నడుమ జీవితం.. బిగ్‌బాస్‌లోను హీరో టెన్షన్
సల్మాన్ ఖాన్‌ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరించింది. శత్రువును అంతం చేయడానికి రూ. 5 కోట్లు డిమాండ్ చేసింది.
సల్మాన్ ఖాన్‌ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరించింది. శత్రువును అంతం చేయడానికి రూ. 5 కోట్లు డిమాండ్ చేసింది. డబ్బు చెల్లించకపోతే ఇటీవల హత్య చేసిన మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ కంటే సల్మాన్ భవితవ్యం అధ్వాన్నంగా ఉంటుందని ముంబై ట్రాఫిక్ పోలీసులకు పంపిన వాట్సాప్ సందేశం హెచ్చరించింది.
అయితే తన పరిస్థితితో ముడిపెడుతూ సందర్భానుసారం బిగ్ బాస్ వేదికపై సల్మాన్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు చర్చగా మారింది. అతడు ఏమన్నారంటే... ``యార్, కసమ్ ఖుదా కీ, నేను నా జీవితంలో ఏం చేస్తున్నాను? నేను దీన్ని నిర్వహించాలి`` అని సల్మాన్ ఖాన్ బిగ్ బాస్‌లో మాట్లాడుతూ, పోటీదారుల మధ్య గొడవలను ప్రస్తావించాడు. గొడవ పడాలి.. ముందుకు సాగాలనేది సల్మాన్ అభిమతమని ఆ సందర్భంలో అర్థం చేసుకున్నారు. నిజానికి సల్మాన్ వ్యాఖ్య ఇటీవలి కాలంలో అతడు ఎదుర్కొంటున్న టెన్షన్ వాతావరణాన్ని ప్రతిబింబించింది. గ్యాంగ్ స్టర్ బెదిరింపులను ప్రస్తావిస్తూ, రియాలిటీ షోను నడిపించడం ఎంత సవాల్ అన్నది సల్మాన్ ఛూఛాయగా ప్రస్థావించారు.
సల్మాన్‌ఖాన్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న పలువురు నిందితులను ముంబై పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అరెస్టయిన నిందితుల్లో ఒకరు పాకిస్తాన్‌కు చెందిన హ్యాండ్లర్‌తో టచ్‌లో ఉన్నారని, పొరుగు దేశం నుండి అక్రమంగా రవాణా చేసిన ఎకె సిరీస్ అసాల్ట్ రైఫిల్స్ వంటి తుపాకీలతో దాడికి ప్లాన్ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ప్రారంభంలో నవీ ముంబై పోలీసులు సల్మాన్‌ఖాన్‌ను హత్య చేసేందుకు ప్లాన్ చేసినందుకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన 18 మందిపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) దాఖలు చేశారు. సల్మాన్ ఖాన్ బాంద్రా ఇంటి వెలుపల ముఠా సభ్యులు కాల్పులు జరిపిన షాకింగ్ సంఘటన తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఇప్పుడు సల్మాన్ స్నేహితుడి హత్యతో కొత్తగా టెన్షన్ వాతావరణం అలుముకుంది.