ఐశ్వర్యారాయ్‌కి సోదరుడిగా సల్మాన్ ఖాన్?
ఇది చాలా అరుదైన దృశ్యం. ఈ సినిమాలో చంద్రచూర్ సింగ్ సరసన ఐశ్వర్య రొమాంటిక్ గా నటించింది.
మన్సూర్ ఖాన్ దర్శకత్వం వహించిన `జోష్` 2000లో విడుదలైంది. ఐశ్వర్య రాయ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ ఇందులో తోబుట్టువులుగా నటించారు. ఇది చాలా అరుదైన దృశ్యం. ఈ సినిమాలో చంద్రచూర్ సింగ్ సరసన ఐశ్వర్య రొమాంటిక్ గా నటించింది. మొహబ్బతే- దేవదాస్ లాంటి చిత్రాలలో రొమాంటిక్ పెయిర్ గా నటించిన ఐశ్వర్యారాయ్- షారూఖ్ ల నటన అసమానం. ముఖ్యంగా దేవదాస్ లో ఈ జంట కెమిస్ట్రీ ప్రజలకు విపరీతంగా నచ్చింది. ఐశ్వర్య ఒకసారి ఇంటర్వ్యూలో SRK సోదరిగా నటించడానికి ఏవైనా భయాలు ఉన్నాయా? అని అడిగారు. దానికి ఐశ్వర్యారాయ్ సమాధానం ఆసక్తికరం. దీనికి సంబంధించి ప్రముఖ హిందీ మీడియాలో చాటింగ్ క్లిప్ ఇప్పుడు వైరల్ అయ్యింది.
ఐష్ చాలా సింపుల్ గా తనకు అలాంటి భయాలేవీ లేవని తెలిపిన క్లిప్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. మన్సూర్‌తో కలిసి పనిచేయడానికి తాను ఓకే చెప్పానని, మొదట సినిమాని ప్రారంభించినప్పుడు, తారాగణం అమీర్ ఖాన్ -సల్మాన్ ఖాన్ నటిస్తారని తనకు చెప్పినట్టు తెలిపింది. అప్పుడు ఏమైందో నాకు తెలియదు. తర్వాత షారుఖ్ - అమీర్ నటిస్తారని ప్రచారమైంది. ఆపై చంద్రచూర్ నా పెయిర్ గా నటించారు. కాబట్టి నటీనటులు మారుతూ వచ్చారు.
స్టార్లు మారుతున్నప్పుడు కూడా నిర్మాత రతన్ జైన్ - మన్సూర్ ఇద్దరూ ఐశ్వర్యను అడిగారు. అయితే ఏ సమయంలోనూ ఈ సినిమా చేయడంపై తనకు ఎలాంటి సందేహం లేదని ఐశ్వర్యరాయ్ ఆయనకు చెప్పారు. ఈ చిత్రంలో షిర్లీ చాలా ప్రత్యేకం. నా పాత్ర కొత్తది.. విభిన్నంగా ఉంటుంది కాబట్టి ఈ చిత్రంలో ఈ పాత్రను చేయడానికి కట్టుబడి ఉన్నానని పేర్కొంది. `జోష్` 2000లో విడుదలైనప్పుడు బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలను పొందింది. ఈ చిత్రం ఇప్పటి వరకు ఐకానిక్ మూవీగా ప్రేమను దక్కించుకుంటోంది. అయితే ముందుగా కాజోల్‌కి షిర్లీ పాత్రను ఆఫర్ చేశారు. కానీ తను తిరస్కరించాక ఐశ్వర్య రాయ్‌ని ఈ అవకాశం వరించింది.