భాయ్ నారింజ చొక్కా.. గాంధీ టోపీ.. దేనికి సంకేతం?
అయితే జూమ్ కథనం ప్రకారం, బిగ్ బాస్ 17 ప్రోమో కోసం సల్మాన్ ఖాన్ షూటింగ్ ప్రారంభించాల్సి ఉందని, దానికోసమే ఈ మేకోవర్ అని తెలుస్తోంది.
సల్మాన్ ఖాన్ టైగర్ 3 ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. అతడు తరచుగా తన లుక్‌తో ప్రయోగాలు చేస్తున్నాడు. ఇటీవల భాయ్ సెమీ-బాల్డ్ లుక్‌లో కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఇంతలోనే ఇప్పుడు సల్మాన్ ఖాన్ మరో న్యూలుక్ కి సంబంధించిన ఫోటో వైరల్ అయ్యింది. ఇది సల్మాన్ లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.
సల్మాన్ ఖాన్ నారింజ పఠానీ సూట్, గాంధీ టోపీ ధరించి కనిపించాడు. అతడు బ్లాక్ హీల్ చెప్పల్స్ ధరించాడు. ఇది షూటింగ్ సమయం కావడంతో సెట్ వైపు వెళుతుండగా తన చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఫోటో వైరల్‌గా మారిన వెంటనే నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందించారు.
ఒక నెటిజన్ అతడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడా? అని అడిగాడు. చాలా మంది సల్మాన్ కొత్త రూపం చూశాక ఆశ్చర్యపోయారు. అయితే జూమ్ కథనం ప్రకారం, బిగ్ బాస్ 17 ప్రోమో కోసం సల్మాన్ ఖాన్ షూటింగ్ ప్రారంభించాల్సి ఉందని, దానికోసమే ఈ మేకోవర్ అని తెలుస్తోంది. సల్మాన్ సాయంత్రం 4 గంటలకు ఇలా కొత్త వేషధారణతో వచ్చాడు. అతడు వెంటనే సెట్లోకి ప్రవేశించాడు.
బిగ్ బాస్ 17 గురించి ప్రస్థావిస్తే.. సల్మాన్ ఖాన్ షో అక్టోబర్ 2023లో ప్రారంభం కానుంది. ఈసారి షో సింగిల్స్ వర్సెస్ కపుల్స్ థీమ్‌ను కలిగి ఉంటుంది. ఇషా మాల్వియా, అంకితా లోఖండే, విక్కీ జై ఆలిస్ కౌశిక్, కన్వర్ డిల్లాన్, నీల్ భట్, ఐశ్వర్య శర్మ తదితరులు పోటీదారుల్లో ఉన్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. సల్మాన్ ఖాన్ `టైగర్ 3` విడుదల సన్నాహకాల్లో ఉన్నాడు. ఈ చిత్రం దీపావళికి విడుదలకు సిద్ధమవుతోంది. గత వారం పోస్టర్ ని లాంచ్ చేయగా భాయ్ అభిమానుల్లో వైరల్ అయింది. బిగ్ బాస్ OTT 2 విజయం తర్వాత సల్మాన్ ఇప్పుడు బిగ్ బాస్ 17 కోసం షూటింగ్ ప్రారంభించాడు. షో ప్రోమో కోసం అభిమానులు ఉత్కంఠగా వేచి చూస్తున్నారు.