మూస‌లో టైగ‌ర్ వ‌ర్క‌వుట‌య్యేనా?

ఒకే క‌థ‌ను తిప్పి తిప్పి సినిమాలు తీయ‌డం మ‌న ద‌ర్శ‌కుల క‌ళ‌. ఈ క‌ళ‌ను కాపీ క‌ళ అని అనాలా లేక స్ఫూర్తి అనాలో అర్థంగాక జ‌నం బుర్ర‌లు పీక్కుంటున్నారు

Update: 2023-10-17 13:30 GMT

ఒకే క‌థ‌ను తిప్పి తిప్పి సినిమాలు తీయ‌డం మ‌న ద‌ర్శ‌కుల క‌ళ‌. ఈ క‌ళ‌ను కాపీ క‌ళ అని అనాలా లేక స్ఫూర్తి అనాలో అర్థంగాక జ‌నం బుర్ర‌లు పీక్కుంటున్నారు. ఇలా కాపీ క‌ళ‌తో సినిమాలు తీసి బోయ‌పాటి లాంటి మాస్ డైరెక్ట‌ర్ హిట్టు (స్కంధ‌తో ఫ్లాప్ సారీ) కొట్ట‌గ‌ల‌డేమో కానీ, మ‌నీష్ శ‌ర్మ కాద‌ని కూడా విమ‌ర్శిస్తున్నారు. స‌ల్మాన్ క‌థానాయ‌కుడిగా అత‌డు తెర‌కెక్కించిన టైగ‌ర్ 3పై ఇలాంటి పంచ్ లే ప‌డుతున్నాయి. నెటిజ‌నులు భారీ ట్రోలింగ్ చేస్తున్నారు. ఏక్ థా టైగ‌ర్- టైగ‌ర్ జిందా హై త‌ర్వాత టైగ‌ర్ ఫ్రాంఛైజీలో వ‌స్తున్న మూడో సినిమాపై నెటిజ‌నుల పంచ్ లు ప‌రిశీలిస్తే వారంతా ఎంత‌గా విసిగిపోయారో అర్థ‌మ‌వుతోంది.

ఇంత‌కుముందే టైగ‌ర్ 3 ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇందులో దీనిని భాయ్ ప‌ర్స‌న‌ల్ మిష‌న్ గా ప్ర‌చారం చేసుకున్నాడు. అత‌డు వార‌సుడిని పోగొట్టుకుని, త‌న‌ కుటుంబానికి జ‌రిగిన అన్యాయానికి ప్ర‌తీకారం తీర్చుకోవ‌డానికి బ‌య‌ల్దేరుతున్నాడు. దీనికి తోడు క‌త్రిన కైఫ్ అరివీర భ‌యంక‌ర పోరాటాలు అద‌నం. అయితే ఈ కంటెంట్ చూస్తుంటే ముందెప్పుడే చూసేసిన‌ట్టే ఉందే! అంటూ నెటిజ‌నులు తీవ్రంగా కామెంట్లు చేస్తున్నారు. టైగ‌ర్ 3 కూడా అదే మూస ఫార్ములాటిక్ సినిమా. అదే పాత ఏజెంట్ సినిమా అంటూ నెటిజ‌నులు తీవ్రంగా దూషిస్తున్నారు. మ‌నీష్ శ‌ర్మ పాత క‌థ‌నే కొత్త‌గా చూపించాడు. ఈసారి కొంత భారీత‌నం పెరిగింది. దీనికి తోడు ఇందులో షారూఖ్ - స‌ల్మాన్ యాక్ష‌న్ ఎపిసోడ్ ని చేర్చాడు అంటూ నెటిజ‌నుల్లో పెద్ద డిబేట్ కొన‌సాగుతోంది. ఏదేమైనా రొటీనిటీ అనేది క‌నిపెట్టేసారు.

అందుకే టైగ‌ర్ 3 ఓపెనింగుల రికార్డులు తేగ‌ల‌దేమో కానీ, లాంగ్ ర‌న్ లో నిల‌బ‌డుతుందా? అన్న సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. ఇంత‌కుముందు షారూఖ్ న‌టించిన ప‌ఠాన్ కానీ, జ‌వాన్ కానీ ఇదే త‌ర‌హా కంటెంట్ తో వ‌చ్చిన‌వే. అంతుకుముందు టైగ‌ర్ జిందా హై, ఏక్ థా టైగ‌ర్ కూడా ఇదే జానర్. ఇప్పుడు ప‌ర్స‌న‌ల్ రైవ‌ల్రీ అంటూ ఒక ఎత్తుగ‌డ‌ను ప్ర‌య‌త్నించారు. కానీ భాయ్ ఎలాంటి పోరాటాలు చేసినా ఇది రొటీన్ కంటెంట్ తో వ‌స్తే ఆక‌ట్టుకుంటుందా? అన్న సందేహాలున్నాయి. మునుపెన్న‌డూ రానివిధంగా స‌రికొత్త స్క్రీన్ ప్లే లాజిక్కులు ఉంటేనే టైగ‌ర్ 3 వ‌ర్క‌వుట‌య్యే ఛాన్సుంది. స‌ల్మాన్ ఖాన్ ఇమేజ్ దృష్ట్యా ఓపెనింగులు సాధ్య‌మ‌వ్వొచ్చేమో కానీ, కంటెంట్ వ‌ర్క‌వుట్ కాక‌పోతే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంద‌ని విశ్లేషిస్తున్నారు.

ఫ్రైడే కాదు సండే రిలీజ్ ఎందుకు?

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, ఇమ్రాన్ హష్మీ నటించిన టైగర్ 3 ఆదివారం అంటే నవంబర్ 12న విడుదల కానుంది. ప్రొడక్షన్ హౌస్ వైఆర్ఎఫ్ ఇప్పుడు ఈ నిర్ణయం వెనుక కారణాన్ని వెల్లడించింది. పఠాన్ తర్వాత, యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుండి మోస్ట్ అవైటెడ్ చిత్రంగా టైగర్ 3 వ‌స్తోంది. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ నవంబర్ 12న దీపావళి సందర్భంగా వెండితెరపైకి రానుంది. ముఖ్యంగా పెద్ద బ్యానర్లలో సినిమాలు శుక్రవారం విడుదలవుతాయి కానీ టైగర్ 3 ఆదివారం థియేటర్లలోకి రావ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

ప్రొడక్షన్ హౌస్ వైఆర్ఎఫ్ ప్రెస్ నోట్‌లో ఇది 'అధిక్ మాస్' సంవత్సరం అని పేర్కొంది. ఇది పండుగలకు సంబంధించి అనేక సమస్యలకు దారితీసింది. అందుకే దీనిని 'వ్యూహాత్మక మరియు ప్రత్యేకమైన' విడుదల ప్రణాళికగా పేర్కొంది. ఈ సంవత్సరం, సోమవారం, నవంబర్ 13, అమావాస్య/అమావాస్య .. గోవర్ధన్ పూజ/గుజరాతీ న్యూ ఇయర్ నవంబర్ 14 న వస్తుంది. భాయ్ దూజ్ నవంబర్ 15 న వస్తుంది. ఈ కీలకమైన సెలవు కాలంలో సినిమాకి పొడిగించిన రన్‌ను అందించేందుకు ఈ మార్పు సహాయపడుతుంది. అని నోట్‌లో పేర్కొన్నారు.

టైగర్ 3 గురించి..

మనీష్ శర్మ దర్శకత్వం వహించిన టైగర్ 3లో ఇమ్రాన్ హష్మీ, కుముద్ మిశ్రా, రేవతి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. షారుఖ్ ఖాన్ పఠాన్ పాత్రలో అతిధి పాత్రలో కనిపించనున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైన SRK పఠాన్‌లో సల్మాన్ ఖాన్ టైగర్‌గా కనిపించగా షారూఖ్ ఖాన్ రిట‌న్ గిఫ్ట్ ఇస్తుండ‌డం అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది.

యష్ రాజ్ స్పై యూనివర్స్ గతంలో వార్, ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, పఠాన్ వంటి చిత్రాలను నిర్మించింది. టైగర్ 3 అనేది కబీర్ ఖాన్ దర్శకత్వంలో ప్రారంభమైన ఫ్రాంచైజీ. టైగ‌ర్ 3 ట్రైల‌ర్ లో కత్రినా కైఫ్ టవల్స్‌లో యాక్షన్ సీక్వెన్స్‌ను ప్రదర్శించడం యువ‌త‌రాన్ని ఆకర్షించింది. 5-సెకన్ల క్లిప్ ఇంటర్నెట్‌లో తుఫానుగా మారింది.

Tags:    

Similar News