ఫ్లాప్ పడ్డా సూపర్ స్టార్ ప్రాంచైజీ కొనసాగింపు!
ఒకప్పుడు హాలీవుడ్ కి మాత్రమే పరిమితం అయిన సినిమా ప్రాంచైజీ సిరీస్ లు గత కొంత కాలంగా బాలీవుడ్ లో కూడా కనిపిస్తున్న విషయం తెల్సిందే
ఒకప్పుడు హాలీవుడ్ కి మాత్రమే పరిమితం అయిన సినిమా ప్రాంచైజీ సిరీస్ లు గత కొంత కాలంగా బాలీవుడ్ లో కూడా కనిపిస్తున్న విషయం తెల్సిందే. క్రిష్ తో పాటు పలు సినిమాల ప్రాంచైజీలు ఇండియన్ సినీ ప్రేక్షకుల అభిమానంను సొంతం చేసుకున్నాయి. టైటిల్ అదే.. నేపథ్యం అదే.. కథ ను మార్చి ప్రాంచైజీ పేరుతో వరుసగా సినిమాలను తీసుకు వస్తున్నారు.
సల్మాన్ ఖాన్ టైగర్ ప్రాంజైజీలో ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చాయి. మొదటి రెండు సూపర్ హిట్ అవ్వగా మూడో సినిమా ఇటీవల దీపావళి సందర్భంగా విడుదల అయ్యి నిరాశ పరిచిన విషయం తెల్సిందే. టైగర్ 3 తీవ్రంగా నిరాశ పరచడంతో సల్మాన్ ఖాన్ అభిమానులు షాక్ అవుతున్నారు.
గత కొంత కాలంగా సల్మాన్ ఖాన్ కెరీర్ పరంగా బ్యాడ్ టైమ్ ను ఎదుర్కొంటున్నాడు. దాంతో ఆయన కెరీర్ ముగింపు దశకు వచ్చిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే సల్మాన్ అభిమానులు మాత్రం టైగర్ 3 పై చాలా ఆశలు పెట్టుకుని, వెయ్యి కోట్ల సినిమా అంటూ మాట్లాడుకున్నారు. తీరా టైగర్ 3 సినిమా మినిమం వసూళ్లు కూడా రాబట్టలేక పోయింది.
టైగర్ 3 సినిమా కమర్షియల్ గా డిజాస్టర్ అని తేలిపోయింది. అయినా కూడా చిత్ర యూనిట్ సభ్యులు తమ ప్రయత్నాలను ఆపడం లేదు. జనాలను థియేటర్లకు రప్పించేందుకు, నడిపించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. తాజాగా స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లో సల్మాన్ ఖాన్ సందడి చేశాడు.
ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా సల్మాన్ ఖాన్ కొద్ది సమయం స్టార్ స్టోర్స్ లో కనిపించాడు. ఆ సమయంలో టైగర్ 3 ఫలితం పట్ల చాలా సంతృప్తిగా ఉంది. ప్రస్తుతం టైగర్ 4 కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. తప్పకుండా మరో భారీ కమర్షియల్ విజయాన్ని అందుకునే విధంగా టైగర్ ప్రాంచైజీలో మరో సినిమా వస్తుందని ఆయన అన్నాడు.
టైగర్ 3 ఫ్లాప్ నేపథ్యం లో టైగర్ ప్రాంచైజీ సినిమాలు ఇక రాకపోవచ్చు అని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా టైగర్ 4 ని ప్రకటించి సల్మాన్ ఖాన్ అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. సల్మాన్ అయితే ప్రకటించాడు కానీ, సినిమా అసలు ఉంటుందా లేదా అనేది వచ్చే వరకు క్లారిటీ ఉండక పోవచ్చు అని కొందరు అంటున్నారు.