ఆర్భాజ్ ఖాన్ రెండో పెళ్లిపై భాయ్ పరిహాసం
కామెడీ క్వీన్ అయిన భారతి వివాహ ఆహ్వానాన్ని అందుకోలేదని అర్బాజ్‌ని ఆటపట్టించింది. దానికి అర్బాజ్ తనదైన శైలిలో జవాబిస్తూ ఆమె తన తదుపరి పెళ్లికి గెస్ట్ లిస్ట్‌లో ఉంటుందని జోక్ చేసాడు.
బాలీవుడ్ స్టార్ హీరో, బిగ్ బాస్ హోస్ట్ సల్మాన్ భాయ్ టైమింగ్ గురించి.. పంచ్‌ల గురించి కొత్తగా చెప్పుకోవడానికేం ఉంది. ఇప్పుడు తన సోదరుడు ఆర్భాజ్ రెండో పెళ్లిపై అతడి పరాచికం ఒక రేంజులో బ్లాస్ట్ అయింది. తమ్ముడి పెళ్లిపైనే అతడు సెటైర్ వేసాడు. బిగ్ బాస్ సీజన్ 17 గ్రాండ్ ఫినాలేలో నవ్వులతో నిండిన సీన్ ప్రత్యక్షమైంది. సల్మాన్, అర్బాజ్ , సోహైల్ ఖాన్ బ్రదర్స్ సరదా పరిహాసం ఇప్పుడు నెటిజనుల్లో సర్వత్రా చర్చగా మారింది. వివాహాల గురించి తమను తాము హేళన చేసుకోవడం.. తమపై తామే జోకులు వేయడంలో బ్రదర్స్ ఎప్పుడూ ముందుంటారు. వారి చర్య ఇప్పుడు నవ్వులు పూయించింది.
అన్నదమ్ముల త్రయం నిజాయితీ .. స్నేహానుబంధం ఈ వేదికపై మరోసారి ప్రస్ఫుటమైంది. బిగ్ బాస్ సీజన్ 17 గ్రాండ్ ఫినాలే సల్మాన్ ఖాన్ సంతోషకరమైన కుటుంబ వ్యవహారాన్ని అందంగా ఎలివేట్ చేసింది. సల్మాన్ సోదరులు అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ చాలా సందడి చేసారు. షురా ఖాన్‌తో అర్బాజ్ ఇటీవలి వివాహానికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా, ఈ వేదిక హాస్యభరితమైన షోగా మారింది. కామెడీ క్వీన్ అయిన భారతి వివాహ ఆహ్వానాన్ని అందుకోలేదని అర్బాజ్‌ని ఆటపట్టించింది. దానికి అర్బాజ్ తనదైన శైలిలో జవాబిస్తూ ఆమె తన తదుపరి పెళ్లికి గెస్ట్ లిస్ట్‌లో ఉంటుందని జోక్ చేసాడు.
అయితే భారతి మళ్లీ ఈ వేదికపైనే ఒక ప్రశ్నను సంధించగా, మలైకా అరోరాతో అర్బాజ్ మొదటి వివాహం గురించి చిన్నపాటి ఇండికేషన్ ఇచ్చిన సల్మాన్ భాయ్ "అర్బాజ్ ఎవరి మాట వినడు" అని సరదాగా వ్యాఖ్యానించాడు. అతడి కామిక్ టైమింగ్‌కి ప్రేక్షకులు పగలబడి నవ్వారు.
భారతి సొహైల్‌ను కూడా విడిచిపెట్టలేదు. చప్పల్స్ షార్ట్‌లు ధరించే అతడి సాదా సీదా ఫ్యాషన్ సెన్స్‌ను చూసి సరదాగా నవ్వింది. బిగ్ బాస్ వేదికపై జరిగిన సరదా సెషన్, గ్రాండ్ ఫినాలేకి ప్రత్యేక ఆకర్షణను తెచ్చింది. ఈ వేదిక ఖాన్ సోదరుల స్నేహాన్ని ఆవిష్కరించింది. ఖాన్ లు సరదాగా నవ్వేస్తూ అందరినీ నవ్విస్తూ చాలా సందడి చేసారు.