స‌మంత‌కు అన్నినెల‌లు..ర‌ష్మిక‌కు తొమ్మిదో నెల‌!

స్టార్ హీరోయిన్లు స‌మంత‌..ర‌ష్మిక మంద‌న్న న‌టించిన సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకొచ్చి నెల‌లు గ‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-09-24 13:30 GMT

స్టార్ హీరోయిన్లు స‌మంత‌..ర‌ష్మిక మంద‌న్న న‌టించిన సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకొచ్చి నెల‌లు గ‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఖుషీ త‌ర్వాత స‌మంత అమెరికా ప‌య‌నం దాన్నిముగించుకుని ముంబైలో నూ మ‌కాం వేసింది. ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ కొత్త ప్రాజెక్ట్ లు ప‌ట్టాలెక్కిస్తోంది. మ‌రోవైపు ర‌ష్మిక మంద‌న్న చేతిలో చెప్పుకోవ‌డానికి చాలా సినిమాలున్నాయి. వాటి రిలీజ్ సంగ‌తి ఏంటి? అంటేనే స‌రైన స‌మాధానం దొర‌కడం లేదు.


అమ్మ‌డు చివ‌రిగా గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో `యానిమ‌ల్` తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇంత‌వ‌ర‌కూ కొత్త సినిమా రిలీజ్ అవ్వ‌లేదు. చేస్తోన్న సినిమాల‌న్నీ ఆన్ సెట్స్ లోనే ఉన్నాయి. ఇలా స‌మంత‌...ర‌ష్మిక‌లిద్ద‌రు ఆడియ‌న్స్ కి కొన్ని నెల‌లుగా దూరంగా ఉన్నారు. అయితే ఇలా గ్యాప్ ఎక్కువైతే ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌వుతాయో తెలిసిందే. ఎంత ఫాంల్ ఉన్న క‌చ్చితంగా ట‌చ్లో ఉండాల్సింది. ఇండస్ట్రీలో ట‌చ్ మ‌రిచారంటే? వాళ్ల‌ను మ‌ర్చిపోయే ప‌రిస్థితి ఉంటుంది. ఫేం ఉండి సినిమాలు చేయ‌క పోయినా? అది మార్కెట్ పై ప్ర‌భావం ప‌డుతుంది.


అందుకే అభిమానుల‌కు ట‌చ్ లో ఉండేందుకు కొత్త ఫోటోల‌తో ఇన్ స్టాలోయాక్టివ్ గా ఉంటారు. కొన్నాళ్ల పాటు స‌మంత‌..ర‌ష్మిక‌లు కూడా అలా కంటున్యూ అయ్యారు. కానీ ఈ మద్య ఆ యాక్టివిటీ త‌గ్గిన‌ట్లు అయింది. ఈనేప‌థ్యంలో ఇద్ద‌రు కొత్త ఫోటోల‌తో ముందుకొచ్చారు. ఇదిగో ఇక్క‌డిలా స‌మంత త‌మ ఫ్యామిలీకి సంబంధించిన వేడుక‌కు హాజ‌రైన ఫోటోను షేర్ చేసింది. ఇందులో అమ్మ‌డు ఎంతో అందంగా ఉంది. వంగ పువ్వు రంగు ఔట్ ఫిట్ లో స‌మంత ఆక‌ర్ష‌ణీయంగా ఉంది.


చేతిలో బొక్కేతో బ్యాక్ ఫోజ్ ఒక‌టైతే....స్నేహితుల గ్యాంగ్ మ‌ధ్య‌లో మ‌రో ఫోజు ఇచ్చింది. ఇక ర‌ష్మిక మంద‌న్న బాండ్ బ్యూటీలో బ్లాక్ కోట్ దుస్తుల్లో కి దూరిపోయింది. బ్లాక్ దుస్తుల్లో బ్లాక్ కారు ఎక్కుతోన్న ఫోటో ఇది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.


Tags:    

Similar News