సమంత నా సోల్ సిస్టర్ : శోభితా ధూళిపాల
కానీ ఆ సమంత వేరు.. ఈ సమంత వేరు. ఇక్కడ సమంత స్వయానా శోభితకు చెల్లెలు. ఆ ఇద్దరినీ ఒకేచోట చూశాక అభిమానులు మరింత గందరగోళంలో పడిపోతున్నారు.
ప్రస్తుతం తన తాజా హిందీ చిత్రం 'లవ్, సితార' విజయాన్ని ఆస్వాదిస్తున్న శోభితా ధూళిపాళ ఇటీవల తన సోదరి సమంతను తన 'నిజమైన ఆత్మీయురాలు' అని అభివర్ణించింది. సమంత తమ కుటుంబ సభ్యురాలు మాత్రమేనని, సోదరీమణుల మధ్య లోతైన బంధాన్ని ఆవిష్కరించింది శోభిత. శోభిత తన జీవితంలో కొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తున్న సమయంలో సోదరితో బంధం గురించి మాట్లాడింది. సిస్టర్స్ నడుమ సాన్నిహిత్యం అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది.
అయితే ఈ సందర్భంలో అసలు ఈ సమంత ఎవరు? అంటూ అభిమానులు గందరగోళంలోనే ఉన్నారు. సమంత పేరెత్తగానే శోభితకు కాబోయే భర్త నాగచైతన్య మాజీ భార్య సమంత అనుకునేవాళ్లు లేకపోలేదు. కానీ ఆ సమంత వేరు.. ఈ సమంత వేరు. ఇక్కడ సమంత స్వయానా శోభితకు చెల్లెలు. ఆ ఇద్దరినీ ఒకేచోట చూశాక అభిమానులు మరింత గందరగోళంలో పడిపోతున్నారు. ఆ ఇద్దరిలో ఎవరు శోభిత అనే కన్ఫ్యూజన్ కూడా నెలకొంది. అక్కా చెల్లెళ్లు అచ్చు గుద్దినట్టున్నారు. ప్రస్తుతం శోభిత- సమంత అందమైన ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి.
సమంత, శోభిత ఇద్దరూ వారి వృత్తిలో బిజీ నాయికలుగా ఉన్నారు. ఇద్దరు ప్రముఖ కథానాయికలు పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తున్నారు. ఇటు దక్షిణాదితో పాటు అటు ఉత్తరాదినా ఆ ఇద్దరికీ విపరీతమైన క్రేజ్ ఉంది. సమంత నటించిన సిటాడెల్ - హనీ బన్నీ నవంబర్ లో స్ట్రీమింగ్ కి రెడీ అయిన సంగతి తెలిసిందే. శోభిత నటించిన సినిమాలు వరుసగా విడుదలవుతున్నాయి. తాజా చిత్రం లవ్ సితార విజయాన్ని శోభిత సెలబ్రేట్ చేస్తోంది.