త్రోబ్యాక్: ఒంటరితనంపై సమంతకు ప్రశ్న
నాగ చైతన్య నుండి విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత సమంతా రూత్ ప్రభు గురించి రకరకాల కథనాలు వైరల్ అయ్యాయి.
నాగ చైతన్య నుండి విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత సమంతా రూత్ ప్రభు గురించి రకరకాల కథనాలు వైరల్ అయ్యాయి. చైకి శోభితా ధూళిపాళలో ప్రేమ కనిపించింది. ఇద్దరూ ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ సమంతా తన గురించి ఎలాంటి విషయాలను వెల్లడించలేదు. మయోసిటిస్ నుండి కోలుకుని తిరిగి కెరీర్ ని రీబిల్డ్ చేసే పనిలో సమంత బిజీగా ఉందని అభిమానులు భావిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఇబ్బందులు ఎదురైనా అన్నిటినీ అధిగమించి మొక్కవోని ధీక్షతో తాను అనుకున్నది సాధించుకునే ప్రయత్నంలో ఉంది సమంత.
అయితే ఇటీవల సమంత రూత్ ప్రభుకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియో ఎంత పాతది అనేది అస్పష్టంగా ఉంది. ఇండియా టుడే గ్రూప్ ద్వారా ఒక అభిమాని క్లిప్‌ను (Xలో) షేర్ చేశాడు. ఈ క్లిప్‌లో సమంత తన సంబంధం గురించిన ప్రశ్నలకు సమాధానం ఇస్తోంది. ఏదైనా సినిమాలో ప్రత్యేక పాటలు చేయడం గురించి ప్రస్థావించింది. సమంతను ఊ అంటావా... స్పెషల్ నంబర్ నుండి లిరికల్ ఎక్స్‌ప్రెషన్ లాగా ప్రశ్నిస్తూ.. సామ్ ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడుతుందా? అని ఇంటర్వ్యూవర్ ప్రశ్నించారు. కొద్దిపాటి విరామం తర్వాత ``ఊ ఊ అంటాను` (లేదు) అని సమంత రిథమిక్ గా బదులిచ్చింది.
పుష్ప్: ది రైజ్‌లోని ఊ అంటావా ఊ ఊ అంటావా పాట బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన తర్వాత సమంతకు అలాంటి అనేక ఆఫర్లు వచ్చాయి. అయితే ఆమె వాటిని తిరస్కరించానని తెలిపింది. సమంతను మళ్లీ ప్రత్యేక నంబర్ చేయడానికి ఆసక్తి ఉందా అని కూడా అడిగారు. `మరో ఐటెం సాంగ్‌లో సమంతా?` అని అడగ్గా, ఆమె నవ్వుతూ, ``ఊ ఊ అంటాను`` (లేదు) అని సమాధానమిచ్చింది. ఫిల్మ్ మేకర్స్... మీరు వింటున్నారా? అని సంభాషణల్ని ఫన్నీగా కొనసాగించారు.
సమంత సొంతంగా బ్యానర్ ని ప్రారంభించి ఈ సంవత్సరం ప్రారంభంలో నిర్మాతగా తన కొత్త ప్రాజెక్ట్ `మా ఇంటి బంగారం`ని ప్రకటించింది. ఈ సినిమా లుక్ ని కూడా లాంచ్ చేసింది సామ్. దీంతో పాటు సిటాడెల్ హనీబన్ని స్ట్రీమింగ్ ప్రచారంలోను పాల్గొంది సమంత. తదుపరి రాజ్ అండ్ డీకే నిర్మిస్తున్న తదుపరి సిరీస్ రక్త్ బ్రహ్మాండ్ లోను నటిస్తోంది.