స‌మంత ముఖానికి మ్యాక‌ప్ క‌న్ప‌మ్ అయిందిలా!

ఈ నేప‌థ్యంలో తాజాగా అమ్మ‌డు సినిమాకి బ‌ధులు ఓ వెబ్ సిరీస్ కోసం మ్యాక‌ప్ వేసుకోవ‌డానికి రెడీ అవుతోంది.

Update: 2024-09-22 06:30 GMT

స‌మంత న‌టిగా ముఖానికి మ్యాక‌ప్ వేసుకుని ఏడాది దాటింది. చివ‌రిగా 'ఖుషీ' సినిమాలో న‌టించింది. అంత‌కు ముందే 'సీటాడెల్' ఇండియ‌న్ వెర్ష‌న్ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసింది. వెంట‌నే అమెరికా వెకేష‌న్ చెక్కేసింది. కొన్నినెల‌లు అనంత‌రం అమ్మ‌డు మ‌ళ్లీ ఇండియాకి తిరిగొచ్చింది. అప్ప‌టి నుంచి స‌మంత కొత్త సినిమా వివ‌రాలేంటి? అని నెట్టింట ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు సాగాయి.

నెల‌లు గ‌డుస్తున్నా అమ్మ‌డు కొత్త సినిమా వివ‌రాలు ఏవీ చెప్ప‌క‌పోవ‌డంతో అసలు అవ‌కాశాలు వ‌స్తున్నాయా? అన్న సందేహాలు సైతం మొద‌లయ్యాయి. బాలీవుడ్ లో ఆ సినిమా సై న్ చేసింది. ఈ సినిమా చేసింద‌ని ఆమెరికా టూర్ కి ముందు బోలెడంత ప్ర‌చారం సాగింది. కానీ ఏదీ ప‌ట్టాలెక్క‌క‌పోవ‌డంతో అవ‌న్నీ గాలి వార్త‌ల‌ని క‌న్ప‌మ్ అయింది. ఈ నేప‌థ్యంలో తాజాగా అమ్మ‌డు సినిమాకి బ‌ధులు ఓ వెబ్ సిరీస్ కోసం మ్యాక‌ప్ వేసుకోవ‌డానికి రెడీ అవుతోంది.

రాజ్ అండ్ డీకే రూపొందిస్తున్న 'ర‌క్త బ్ర‌హ్మాండ్' వెబ్ సిరీస్ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం అవుతుంది. ఈ యాక్ష‌న్ ఫాంట‌సీలో స‌మంత ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. ఇది ఎప్పుడో క‌న్ప‌మ్ అయిన విష‌యం . కానీ షూట్ డిలే అయింది ఇంత‌కాలం. తాజాగా ఈ వెబ్ సిరీష్ షూటింగ్ ప్రారంభ‌మైంద‌ని స‌మంత ప్ర‌క‌టించింది. 'ఎప్ప‌టికీ క‌ల‌లు క‌న‌డం ఆపొద్దు. చాలా కాలం త‌ర్వాత మ‌ళ్లీ సెట్స్ పైకి రావ‌డం ఆనందంగా ఉంది' అని తెలిపింది.

దీంత సమంత మ్యాక‌ప్ వేసుకోడం క‌న్ప‌మ్ అయింది. ఏడాది కాలంగా న‌ట‌న‌కు దూరంగా ఉన్న అమ్మ‌డు మ‌ళ్లీ వెబ్ సిరీస్ తోకంబ్యాక్ అవుతోంది. త్వర‌లోనే స‌మంత న‌టించిన 'సీటాడెల్' ఇండియ‌న్ వెర్ష‌న్ రిలీజ్ అవుతుంది. ఇప్ప‌టికే రిలీజ్ అవ్వాల్సిన సిరీస్ డిలే అయింది.

Tags:    

Similar News