టాలీవుడ్ పై సమంత సంచ‌ల‌నం..సీఎం రేవంత్ కి విజ్ఞ‌ప్తి!

తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని నెలకొల్పడానికి రూపొందించిన సబ్ కమిటీ నివేదికను ప్రచురించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సమంత కోరారు.

Update: 2024-08-31 06:32 GMT

మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో జ‌స్టిస్ హేమ క‌మిటీ దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైన వేళ‌.. బాధిత మ‌హిళ‌లంతా ఒక్కొక్క‌రుగా మీడియా మందుకొచ్చి గోడును విన్న వింంచుకుంటోన్న వేళ తాజాగా న‌టి స‌మంత చేసిన పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్ లో సంచ‌ల‌నంగా మారింది. తెలుగు సినీ పరిశ్రమలోనూ, లైంగిక వేధింపులు..సమస్యల పైన ఇచ్చిన ఓ నివేదికను వెల్లడించాలని తెలంగాణ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స‌మంత విజ్ఞ‌ప్తి చేసారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని నెలకొల్పడానికి రూపొందించిన సబ్ కమిటీ నివేదికను ప్రచురించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సమంత కోరారు. టాలీవుడ్ లో మహిళల కోసం 2019లో ఏర్ప‌డిన సపోర్ట్ గ్రూప్ అయిన ది వాయిస్ ఆఫ్ ఉమెన్‌‌ స‌బ్ క‌మిటీ నివేదిక‌ను తాజా ప్ర‌భుత్వం రిలీజ్ చేయాల‌ని స‌మంత విజ్ఞ‌ప్తి చేసారు.

ఈ క‌మిటీ కేర‌ళ‌లో ఏర్పాటై ఉమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌ గ్రూప్‌ స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాల‌ని కోరారు. ఈరోజు జ‌స్టిస్ హేమ క‌మిటీ ఏర్పాటైంది అంటే దానికి కార‌ణం ఉమెన్ ఇన్ సినిమా క‌లెక్టివ్ అని గుర్తు చేసారు. ఆ సంస్థ సభ్యుల కష్టం వల్లే ఈ రోజు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మహిళలపై జ‌రుగుతోన్న‌ దాడుల‌పై దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయ‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఆ సంఘం స‌భ్యుల్ని స‌మంత కొనియాడారు. వారి అవిశ్రామ పోరాట‌మే నేటి హేమ క‌మిటీ సంచ‌ల‌నం అంటూ గుర్తు చేసారు.

2018లో వ‌ర్ద‌మాన న‌టి, యాంక‌ర్ శ్రీరెడ్డి తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌పై చేసిన లైంగిక ఆరోప‌ణ‌లు ఎంత‌టి సంచ‌ల‌న‌మ‌య్యాయో? తెలిసిందే. ఫిల్మ్ ఛాంబ‌ర్ ఎదుట‌ న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగ‌డంతో దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దీంతో అప్ప‌టి ప్ర‌భుత్వం కూడా స్పందించి చ‌ర్య‌ల‌కు ఆదేశించింది. ఆ త‌ర్వాత ఇండ‌స్ట్రీలో సంఘాలు కూడా స్పందించి 2019 లో ఓ క‌మిటీ వేయ‌డం జ‌రిగింది.

Tags:    

Similar News