సమంత పోస్ట్.. 2025లో పిల్లలట!
అదే సమయంలో రీసెంట్ గా ఇన్ స్టాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు సమంత. 2025లో తన రాశికి ఎలా ఉంటుందోనన్న విషయంపై ఒక మెసేజ్ ను షేర్ చేశారు.
స్టార్ హీరోయిన్ సమంత.. ఇన్ స్టాగ్రామ్ లో ఫుల్ గా యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పిక్స్ తో పాటు తన జీవితానికి సంబంధించిన పలు విషయాలను తరచూ షేర్ చేసుకుంటుంటారు. ఆరోగ్యపరంగా ఉపయోగపడే టిప్స్ ను ఇస్తుంటారు. అందుకే ఆమె ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటుంటారు.
అయితే సమంత తండ్రి జోసెఫ్ గత నెలలో మరణించగా.. ఆమె ఆ బాధ నుంచి బయటకు వచ్చేందుకు వర్క్ లైఫ్ పై ఫుల్ గా ఫోకస్ పెట్టినట్లు క్లియర్ గా తెలుస్తోంది. ఇటీవల సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామ్.. తన యాక్టింగ్ తో విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుని అబ్బురపరిచారు.
ఇప్పుడు రక్త్ బ్రహ్మాండ్ ది బ్లడీ కింగ్ డమ్ అనే మరో వెబ్ సిరీస్ తో బిజీగా ఉన్నారు. ఇటీవల సెట్స్ లోకి కూడా అడుగు పెట్టారు. ఆ సమయంలో మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి వచ్చేశానంటూ పోస్ట్ పెట్టారు. అంతకుముందు కొద్ది రోజుల క్రితం.. మా ఇంటి బంగారం మూవీ అనౌన్స్ చేశారు. దీంతో ఆమె ఫుల్ బిజీగా ఉన్నట్లే!
అదే సమయంలో రీసెంట్ గా ఇన్ స్టాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు సమంత. 2025లో తన రాశికి ఎలా ఉంటుందోనన్న విషయంపై ఒక మెసేజ్ ను షేర్ చేశారు. వృషభ, కన్య, మకర రాశి వారు 2025లో వీటిని పొందే అవకాశం ఎక్కువగా ఉందంటూ పలు విషయాలను పాయింట్ల రూపంలో పోస్ట్ చేశారు సమంత. అవేంటంటే?
ఏడాదంతా బిజీగా గడుపుతారు, వృత్తి పరంగా మెరుగు పడతారు, డబ్బులు ఎక్కువ సంపాదిస్తారు, మీరు ఆర్థికంగా బలంగా ఉంటారు, ప్రేమను పంచే భాగస్వామిని పొందుతారు, పాత లక్ష్యాలను పూర్తి చేస్తారు, ఆదాయం వచ్చే మార్గాలు పెంచుకుంటారు, మరిన్ని అవకాశాలు సొంతం చేసుకుంటారు.. అంటూ రాసుకొచ్చారు.
మానసికంగాతోపాటు శారీరకంగా కూడా స్ట్రాంగ్ గా ఉంటారని, పిల్లలను పొందుతారని కూడా సామ్ ఇచ్చిన లిస్ట్ లో ఉంది. దీంతో భాగస్వామి, పిల్లలు కోసం సమంత పోస్ట్ లో ఉండడంతో నెట్టింట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. మేడమ్.. మీకు అన్ని విధాలుగా అంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు అభిమానులు చెబుతున్నారు.