సమంత మార్నింగ్ టెక్నీక్స్.. అందుకేనా ఇంత ఎనర్జీ!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను సిల్వర్ స్క్రీన్ పై చూసి ఏడు నెలలు అయిపోతుంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను సిల్వర్ స్క్రీన్ పై చూసి ఏడు నెలలు అయిపోతుంది. గత ఏడాది సెప్టెంబరులో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి మూవీతో సందడి చేసింది సామ్. రౌడీ హీరోతో బ్యూటిఫుల్ గా కెమిస్ట్రీ పండించింది. ఆ తర్వాత విదేశాలకు వెళ్లిపోయింది. కొన్ని నెలల క్రితం మయోసైటిస్ వ్యాధి బారినపడడంతో.. ఫుల్ రెస్ట్ తీసుకుంది. పూర్తి కోలుకుని ఇటీవల ఇండియా వచ్చేసింది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రానుంది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను మేకర్స్ పూర్తి చేస్తున్నారు. రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఈ సిరీస్ కోసం సమంత చాలా కష్టపడింది. ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంది. దీంతో ఈ సిరీస్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి
అయితే సమంత ఇటీవల పాడ్ కాస్ట్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఎపిసోడ్స్ వారీగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటుంది. కొన్ని రోజుల క్రితం.. సిటాడెల్ షూటింగ్ టైమ్ లో తన పడ్డ కష్టాలను వివరించింది. ఒకసారి కళ్లు తిరిగి పడిపోయానని కూడా చెప్పింది. భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు వర్ణించలేని బాధను అనుభవించానని చెబుతూ ఎమోషనల్ అయింది.
తాజాగా కొత్త ఎపిసోడ్ లో తన డైలీ మార్నింగ్ రొటీన్ ను షేర్ చేసుకుంది. ఒక్కరోజు కోసం తన దినచర్యను ఫాలో అవ్వొద్దని కోరింది. సక్సెస్ ఫుల్ గా రొటీన్ ఫాలో అవ్వాలంటే కృషితోపాటు క్రమశిక్షణ అవసరమని పేర్కొంది. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం డైలీ రొటీన్ అనుసరించాలని చెప్పింది. రోజూ ఉదయం 5.30 గంటలకు నిద్ర లేచి, ఓ యాప్ లో కృతజ్ఞతా భావాన్ని అలవరచుకోవడమెలా అనే అంశాన్ని నేర్చుకుంటున్నట్లు తెలిపింది.
ఆ తర్వాత ఎండలో ఐదు నిమిషాలు నిల్చుంటానని, 25 నిమిషాలపాటు ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేస్తానని తెలిపింది సమంత. ఎనర్జీ కోసం ట్యాపింగ్ టెక్నిక్ ఉపయోగిస్తానని చెప్పింది. కొన్నిసార్లు కష్టంగా అనిపించినా, సవాళ్లు ఎదురైనా.. డైలీ రొటీన్ కచ్చితంగా ఫాలో అవుతానని చెప్పింది. తన దినచర్యతోనే మానసికంగా స్థిరంగా, ఎనర్జీతో ఉంటున్నట్లు తెలిపింది సామ్. ప్రస్తుతం సమంత డైలీ మార్నింగ్ రొటీన్ నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతోంది.