WWE ఫైట‌ర్ అనుకుంటారేమో సామ్

స‌మంత ఊహించ‌ని విధంగా ఆటో ఇమ్యూన్ వ్యాధికి గురైంది.

Update: 2024-06-17 04:34 GMT

 అవును.. స‌మంత‌ను ఇలా చూస్తే మీరైతే ఏమ‌ని అనుకుంటున్నారు? టూమ‌చ్ ఫిట్నెస్ ఫ్రీక్! అని చాలా మంది అనుకుంటారు. WWE ఫైట‌ర్ లా మారిందేమిటీ అని ఆశ్చ‌ర్య‌పోతారు. ఇంత‌లోనే అంత‌గా మారిపోయిందేమిటీ సామ్? ఫిట్ నెస్ పై ఆస‌క్తి ఉంద‌ని అనుకున్నాం కానీ, మ‌రీ ఇంత టూమ‌చ్ గా అడిక్ట్ అయిపోతుంద‌ని అనుకోలేదు ఎవ‌రూ!

అయితే ఇదంతా మ‌యోసైటిస్ తెచ్చిన అనూహ్య మార్పు. స‌మంత ఊహించ‌ని విధంగా ఆటో ఇమ్యూన్ వ్యాధికి గురైంది. దీంతో త‌న‌ను తాను ర‌క్షించుకునేందుకు స‌మంత ఫిట్నెస్ పై మ‌రింత ఎక్కువ‌గా శ్ర‌ద్ధ పెట్టింది. ఒక స్టార్ గా జిమ్ కి వెళ్ల‌డం వేరు..! ఇప్పుడు జిమ్ చేయ‌డం వేరుగా భావించిన‌ట్టే క‌నిపిస్తోంది. నిరంత‌రం జిమ్, యోగా, మెడిటేష‌న్ స‌హా చాలా విష‌యాల‌పై సమంత దృష్టి సారిస్తోంది.

అయితే సామ్ టోన్డ్ బాడీ అవ‌తార్ ఇప్పుడు వెబ్ ని షేక్ చేస్తోంది. చూస్తుంటే WWE ఫైట‌ర్ లా ప‌ర్ఫెక్ట్ ఫిట్ లుక్ తో రియ‌ల్ అథ్లెట్ ని త‌ల‌పిస్తోంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయ్. సామ్ కాస్త టూమ‌చ్ గానే ఫిట్ నెస్ పై శ్ర‌ద్ధ పెడుతోంది అంటూ ఫ్యాన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి ఫిట్‌గా ఉండటానికి కష్టపడుతున్న చాలా మంది యూత్ కి ఇది ఒక ప్రేరణ. ఆరోగ్య సమస్యలను అధిగమించి ఇతరులకు స్ఫూర్తినివ్వాలనే స‌మంత‌ సంకల్పం నిజంగా గొప్ప‌ది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. స‌మంత త‌న త‌దుప‌రి చిత్రాన్ని ప్ర‌క‌టించ‌లేదు. స‌మంత‌, వ‌రుణ్ ధావ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన‌ సిటాడెల్ ఇండియా వెర్ష‌న్ హ‌నీ బ‌న్ని విడుద‌ల కావాల్సి ఉంది. అలాగే తాప్సీ నిర్మాణ సంస్థ‌లో స‌మంత న‌టిస్తుంద‌ని ప్ర‌చార‌మైంది. స‌ల్మాన్ స‌ర‌స‌నా న‌టించే అవ‌కాశం ఉంద‌ని క‌థ‌నాలొచ్చినా కానీ దానిపై ఎలాంటి ప్ర‌క‌ట‌నా లేదు.

Tags:    

Similar News