2024లో సమంత గోల్?

చాలా మంది జంట‌లు కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల కోసం విదేశీ వెకేష‌న్ల‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అయితే సోలోగా అయినా స‌మంత రూత్ ప్ర‌భు వీళ్ల‌లో ఎవ‌రికీ త‌క్కువ కాదు.

Update: 2024-01-03 04:09 GMT

చాలా మంది జంట‌లు కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల కోసం విదేశీ వెకేష‌న్ల‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అయితే సోలోగా అయినా స‌మంత రూత్ ప్ర‌భు వీళ్ల‌లో ఎవ‌రికీ త‌క్కువ కాదు. అస‌లు త‌గ్గేదేలే! అంటూ దుబాయ్ వినువీధుల్లో విహ‌రించిన సమంతా రూత్ ప్రభు ప్రకాశవంతమైన లైట్లు, కాంతుల్లో సెల‌బ్రేష‌న్ ని ప‌రాకాష్ఠ‌కు చేర్చింది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.


స‌మంత‌కు 3.1 కోట్ల (31 మిలియన్ల) మంది ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ ఉన్నారు. అంద‌రికీ కొత్త సంవ‌త్స‌రం వేళ‌ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది. ''చాలా మంది దేవదూతలు మమ్మల్ని చుట్టుముట్టవచ్చు.. హ్యాపీ న్యూ ఇయర్'' అని విష్ చేసింది. సమంత‌ అద్భుతమైన క్రీమ్ బ్యాక్‌లెస్ స్ట్రాపీ థై స్లిట్ దుస్తుల‌ను ధ‌రించింది. అల్ట్రా మోడ్ర‌న్ డిజైన‌ర్ దుస్తుల్లో క‌నిపించిన‌ సమంతలోని ఆత్మవిశ్వాసం నేటిత‌రానికి స్ఫూర్తి. అందమైన చిరున‌వ్వులతో సామ్ కొత్త సంవ‌త్స‌రాన్ని స్వాగ‌తించింది. అయితే ఈ కొత్త సంవ‌త్స‌రంలో స‌మంత గోల్స్ ఏమిట‌న్న‌ది అభిమానుల‌కు క‌న్ఫ్యూజ‌న్ గా ఉంది.

గ‌త ఏడాది శాకుంత‌లం- ఖుషి వంటి చిత్రాలు ఆశించిన రేంజుకు చేర‌లేదు. దీంతో ఇప్పుడు త‌దుప‌రి చిత్రాల‌పై స‌మంత దృష్టి సారిస్తోంది. ఓవైపు సిటాడెల్ భార‌తీయ వెర్ష‌న్ ప్ర‌మోష‌న్స్ కి సిద్ధ‌మ‌వుతూనే, స‌ల్మాన్ భాయ్ స‌ర‌స‌న ది బుల్ చిత్రంలో న‌టిస్తుంద‌ని క‌థానాలొస్తున్నాయి. ఈ చిత్రాన్ని క‌ర‌ణ్ జోహార్ నిర్మిస్తున్నారు.

సల్మాన్‌తో రొమాన్స్?

కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించే త‌దుప‌రి చిత్రంలో సమంతా రూత్ ప్రభు-సల్మాన్ ఖాన్ రొమాన్స్ చేసే అవకాశం ఉంద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఈ సినిమా కోసం దర్శకుడు విష్ణువర్ధన్‌తో సమంత చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. నిజానికి భాయ్ స‌ర‌స‌న‌ త్రిష, అనుష్క శెట్టి పేర్ల‌ను కూడా విష్ణు వ‌ర్ధ‌న్ పరిశీలిస్తున్నట్లు పాపుల‌ర్ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ పేర్కొంది. కానీ స‌మంత‌ను ఎంపిక చేసార‌ని ప్ర‌చారం సాగుతోంది. అయితే మేకర్స్ నుండి ఇప్పటి వరకు దీనికి సంబంధించి అధికారిక ధృవీకరణ లేదు.

సల్మాన్ ఖాన్ - కరణ్ జోహార్ కాంబినేష‌న్ పై మొదట గ‌త‌ సంవత్సరం ఆగస్టులో హెడ్ లైన్స్ వ‌చ్చాయి. 1998 చిత్రం `కుచ్ కుచ్ హోతా హై`లో సల్మాన్ కనిపించిన అనంత‌రం 25 సంవత్సరాలకు వీరిద్దరి కలయిక సాధ్యం కానుంది. ఈ చిత్రం నవంబర్ 2023లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని.. 7 నుండి 8 నెలల వ్యవధిలో భారీ షెడ్యూల్‌లలో చిత్రీకర‌ణ పూర్తి చేస్తార‌ని క‌థ‌నాలొచ్చాయి. షేర్‌షా తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో విష్ణు వర్ధన్‌కి ఇది రెండవ చిత్రం. ప్రీ-ప్రొడక్షన్ వర్క్ ఆగస్ట్ 2023 నుండి ప్రారంభమవుతుందని కూడా క‌థ‌నాలొచ్చాయి. టైగ‌ర్ 3 యావ‌రేజ్ గా ఆడ‌టంతో స‌ల్మాన్ పూర్తిగా త‌దుప‌రి చిత్రంపైనే ఫోక‌స్ పెట్టాడు.

Tags:    

Similar News