స‌మంత భ‌విష్య‌త్ సూప‌ర్ ఉమెన్?

హాలీవుడ్ లో సిటాడెల్ సిరీస్ లో న‌టించిన భార‌తీయ న‌టి ప్రియాంక చోప్రా సూప‌ర్ ఉమెన్ గా అద్భుత న‌ట‌న‌తో ఆకట్టుకున్నారు.

Update: 2024-08-02 17:30 GMT

క‌థానాయ‌కులే సూప‌ర్ హీరోలుగా న‌టించాలా? ఈ రూల్ ని బ్రేక్ చేసి హాలీవుడ్ లో కొన్ని ద‌శాబ్ధాలుగా సూప‌ర్ ఉమెన్ లు ఉద్భ‌వించారు. వారి స‌క్సెస్ రేటు కూడా హీరోల‌కు త‌క్కువేమీ కాదు. బ్లాక్ విడోలో స్కార్లెట్ జాన్స‌న్ న‌ట‌న‌, యాక్ష‌న్ విన్యాసాలకు క‌ళ్లు చెదిరిపోతాయి. వండ‌ర్ ఉమెన్ లో ఇజ్రాయేలీ న‌టి గాల్ గాడోట్ సాహ‌స‌విన్యాసాలు, భ‌యంక‌ర పోరాటాల‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కులు ఆస్వాధించారు. రెసిడెంట్ ఈవిల్ సిరీస్ లో ఇవా జోవిచ్ లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర‌లో అద్భుత న‌ట‌న‌ను ప్రేక్ష‌కులు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. బ్లాక్ పాంథ‌ర్ లో బ్లాక్ లేడీస్ యాక్ష‌న్ విన్యాసాలు క‌ళ్ల ముందే ఎప్ప‌టికీ నిలిచి ఉంటాయి. అవెంజ‌ర్స్, డీసీ సినిమాల్లో సూప‌ర్ మేన్ ల‌తో పాటు, సూప‌ర్ ఉమెన్ లు కూడా రెగ్యుల‌ర్ గా క‌నిపిస్తుంటారు. హాలీవుడ్ లో సిటాడెల్ సిరీస్ లో న‌టించిన భార‌తీయ న‌టి ప్రియాంక చోప్రా సూప‌ర్ ఉమెన్ గా అద్భుత న‌ట‌న‌తో ఆకట్టుకున్నారు.


ఇప్పుడు అదే పాత్ర‌లో ఇండియా వెర్ష‌న్ కోసం స‌మంత న‌టించ‌డం ఇటు భార‌తీయ ప్రేక్ష‌కుల‌ను, ముఖ్యంగా సౌతిండియా అభిమానుల‌ను ఎంత‌గానో ఎగ్జ‌యిట్ చేస్తోంది. రాజ్ అండ్ డీకే లాంటి ప్ర‌తిభావంతులు స‌మంత‌ను లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర‌లో ఎలా చూపించ‌బోతున్నారో చూడాల‌ని అభిమానులంతా ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా ఉన్నారు. ఫ్యామిలీమ్యాన్ 2 త‌ర్వాత స‌మంత న‌టించిన భారీ క్రేజీ వెబ్ సిరీస్ ఇది. దీనికోసం అటు ఉత్త‌రాది, ఇటు ద‌క్షిణాది రెండు చోట్లా ఫ్యాన్స్ వెయిటింగ్.


అదంతా అటుంచితే ఇటీవ‌ల సిటాడెల్ - హ‌నీ బ‌న్నీ ప్ర‌మోష‌న్స్ లో స‌మంత క‌నిపించిన తీరు సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురి చేసింది. సామ్ సూట్ లో ప‌ర్ఫెక్ట్ ఫిట్ లుక్ తో క‌నిపించింది. పైగా సూప‌ర్ ఉమెన్ అవ‌తార్ కి క‌చ్ఛితంగా ఆ ఫిజిక్ స‌రిపోయింద‌ని ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. సూప‌ర్ ఉమెన్, వండ‌ర్ ఉమెన్, క్యాట్ ఉమెన్ ఎలాంటి పాత్ర‌కు అయినా స‌మంత రూపం ప‌ర్ఫెక్ట్ యాప్ట్. త‌న‌కు అలాంటి ఒక అవ‌కాశం ల‌భిస్తే క‌చ్ఛితంగా అద్భుతాలు చేయ‌గ‌ల‌దు. భవిష్య‌త్ సూప‌ర్ ఉమెన్ గా స‌త్తా చాట‌గ‌ల‌ద‌ని అభిమానులు భావిస్తున్నారు. అంత‌గా స‌మంత కొత్త హ‌నీ బ‌న్నీ లుక్ యువ‌త‌రానికి క‌నెక్ట‌యిపోయింది.


ఓవైపు వైఆర్ఎఫ్ సంస్థ త‌న స్పై యూనివ‌ర్శ్ లోకి ఆలియా భ‌ట్ లాంటి ప్ర‌తిభావంతురాలిని ఎంపిక చేయడం త‌న‌ను లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర‌లో ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌డంతో అది దేశ‌వ్యాప్తంగా ఆలియా ఫ్యాన్స్ ని ఎంత‌గానో ఎగ్జ‌యిట్ చేస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో సిటాడెల్ భార‌తీయ వెర్ష‌న్ హ‌నీ బ‌న్నీలో స‌మంత లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర ఎలా ఉంటుందో చూడాల‌ని త‌హ‌త‌హ అంద‌రిలో ఉంది. అంతేకాదు.. భ‌విష్య‌త్ లో స‌మంత నాయికా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించేందు ఛాన్సుంద‌ని, లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర‌ల్లో త‌న‌ను చూడాల‌ని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. భార‌త‌దేశం నుంచి లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర‌ల్లో మెప్పించ‌గ‌ల సామ‌ర్థ్యం .. ప్రియాంక చోప్రా, స‌మంత‌, ఆలియా భ‌ట్, దీపిక ప‌దుకొనే (ప‌ఠాన్‌లో యాక్ష‌న్‌తో వండ‌ర్స్ సృష్టించింది), క‌త్రిన (టైగ‌ర్ జిందా హై) వంటి వారికి ఉంద‌ని ప్ర‌జ‌లు విశ్వ‌సిస్తున్నారు. మారుతున్న ట్రెండ్ లో భ‌విష్య‌త్ లో బాలీవుడ్ బ్యూటీస్ తో పోటీప‌డుతూ సౌత్ నుంచి స‌మంత సూప‌ర్ ఉమెన్ గా రాణిస్తుందేమో వేచి చూడాలి.

Tags:    

Similar News