పింక్ డిజైన్ లో సమంత పరిమళం
విశ్రాంతిలో భాగంగా సమంత అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే.
విశ్రాంతిలో భాగంగా సమంత అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని లాంగ్ బ్రేక్ తీసుకుంది. అన్నీ రకాల సమస్యల నుంచి ఉపశమనం కోసమే ఇంత గ్యాప్ తీసుకుంటుంది. మనసుకు తగిలిన గాయాల నుంచి బయటపడిన అమ్మడు ఆ వెంటనే మయోసైటిస్ బారిన పడటం..కోలుకోవడం జరిగింది. కానీ అదంతా సినిమా షూటింగ్ లు చేస్తూ చేయాల్సి వచ్చింది.
అందుకే లాంగ్ బ్రేక్ అంటూ అమెరికా చెక్కేసినా! అమ్మడు ఇన్ స్టా యాక్టివిటీ చూస్తే షాక్ అవ్వక తప్పదు. సొసగరి అమెరికా వెళ్లిన దగ్గర నుంచి కొత్త ఫోటోలతో ఇన్ స్టాని హీటెక్కిస్తుంది. అమెరికా అందాల్లో ఫోటోలు దిగుతూ వాటిని అభిమానులతో పంచుకుంటుంది. దీంతో ఆమె విశ్రాంతి కోసం వెళ్లిందా? వెకేషన్ కోసం వెళ్లిందా? అన్న సందేహాలు తెరపైకి వచ్చాయి. కానీ ఇదొక మానసిక విరామం అన్నది సమంత అభిప్రాయం.
అందుకే తనపై నెగిటివిటీ స్ప్రెడ్ అవుతున్నా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగిపోతుంది. తాజాగా సమంత ఇన్ స్టాలో మరో కొత్త ఫోటోని పోస్ట్ చేసింది. అందులో సమంత పింక్ వర్ణం డిజైన్ లో తళతళలాడిపోతుంది. కేన్స్ ఉత్సవాల్లో ర్యాంప్ వాక్ చేస్తున్నట్లు అమ్మడు అలా స్టైలిష్ గా నడుచుకుంటూ వస్తుండగా క్లిక్ మనిపించినా పిక్ లా ఉంది. సామ్ మెడలో డిజైన్డ్ నక్లెస్ నెక్ ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది.
అమ్మడి మ్యాకప్..స్కిన్ టోన్ చూపరులను ఆకర్షిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. అభిమానులు లుక్స్ గార్జియస్...బ్యూటీఫుల్ అంటూ పొగిడేస్తున్నారు. మోడ్రన్ దుస్తుల్లోనే కాదు..సంప్రదాయ దుస్తుల్లోనూ కనిపించండి అంటూ కొంతమంది అభిమానులు కోరుతున్నారు. లాంగ్ బ్రేక్ తీసుకుంది కాబట్టి ఈ లోపు అన్ని రకాల దుస్తుల్లోనూ సామ్ మురిపించడం ఖాయం