సమంత ఫిట్‌నెస్ రొటీన్ బ్యాలెన్స్‌డ్ మెనూ

ఫిట్‌నెస్ ఫ్రీక్ స‌మంత రూత్ ప్ర‌భు దిన‌చ‌ర్య గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు.

Update: 2024-06-26 14:30 GMT

ఫిట్‌నెస్ ఫ్రీక్ స‌మంత రూత్ ప్ర‌భు దిన‌చ‌ర్య గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. నిరంత‌ర‌ వ్యాయామం, యోగా సెష‌న్స్ .. ఆహార నియ‌మాలను అనుస‌రించ‌డంలో సామ్ అంద‌రికీ స్ఫూర్తి. త‌న జిమ్ షెడ్యూళ్ల‌ గురించి, తీసుకునే ఆహారం గురించి నిరంత‌రం సోష‌ల్ మీడియాల్లో అభిమానుల‌తో చాలా విష‌యాల‌ను షేర్ చేస్తుంటారు. ఇప్పుడు తాజా పోస్ట్‌లలో పోషకాహారం..వ్యాయామ నియమావళిని స‌మంత షేర్ చేసారు.


సామ్ ఇన్ స్టాలో షేర్ చేసిన మెనూలో తగినంత మొత్తంలో ప్రోటీన్, ఫైబర్, ఉడకబెట్టిన వెజ్ పులుసు.., ప్రోబయోటిక్స్‌తో కూడిన సమతుల్య లంచ్ మెనూకి సంబంధించిన ఒక ఫోటోని షేర్ చేసింది. తదుపరి మిర్రర్ సెల్ఫీ లో ``ట్రైనింగ్, సెషన్ 1 వెయిట్ ట్రైనింగ్`` అని స‌మంత‌ రాసింది. మ‌రో క్లిక్ లో మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ రాకేష్ యాదవ్‌తో సెల్ఫీ ని షేర్ చేసి ఈ ఫోటోకి `సెషన్ 2 మార్షల్ ఆర్ట్స్` అని క్యాప్షన్ ఇచ్చింది. చివరగా అలసిపోయి కుర్చీలో ఒంటరిగా కూర్చుని `సెషన్ 3 డెడ్` అని రాసి ఉన్న ఓ ఫోటోని సామ్ షేర్ చేసారు.


స్వయం ప్రతిరక్షక వ్యాధి మయోసిటిస్‌తో బాధపడుతున్నప్పటి నుండి శరీరం, మనస్సు రెండింటినీ స్థిరంగా - ఉంచుకోవడం ద్వారా స‌మంత తిరిగి ఆరోగ్యంగా మారింది. దీంతో ఫిట్ నెస్ ప్రాముఖ్యతను సమంత నిరంత‌రం ప్ర‌చారం సాగిస్తోంది. ముఖ్యంగా ఇన్ స్టా వేదిక‌గా త‌న అభిమానుల‌కు సామ్ ఫిట్ నెస్ క్లాసులు తీసుకుంటోంది. దీనికి ఫ్యాన్స్ నుంచి స్పంద‌న అద్భుతంగా ఉంది.


కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... స‌మంత త‌దుప‌రి తెలుగు చిత్రం `బంగారం`లో కనిపించనుంది. ఈ సినిమాతో నిర్మాతగాను ఆరంగేట్రం చేస్తుంది. వరుణ్ ధావన్‌తో కలిసి `సిటాడెల్: హనీ బన్నీ`లో న‌టించింది. రాజ్ అండ్ DK దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఈ సంవత్సరం OTTలో ప్రీమియర్ అవుతుంది.

Read more!

Tags:    

Similar News