ఇనుములా మారిపోతున్న సమంత
తాజాగా సమంత జిమ్ లో శ్రమిస్తున్న ఓ వీడియోని సోషల్ మీడియా ప్రొఫైల్ లో షేర్ చేయగా అది వైరల్ గా మారుతోంది.
అవును.. సమంత ఇనుములా మారిపోతోంది. శరీరాన్ని అంతగా సానబడుతోంది. జిమ్ లో నిరంతరం సమంత కాయకష్టం చూస్తుంటే ఔరా! అని ముక్కున వేలేసుకోవాల్సిందే. అంతలా కసరత్తులతో దడ పుట్టిస్తోంది. తాజాగా సమంత జిమ్ లో శ్రమిస్తున్న ఓ వీడియోని సోషల్ మీడియా ప్రొఫైల్ లో షేర్ చేయగా అది వైరల్ గా మారుతోంది.
నిజానికి మయోసైటిస్ తో ఇబ్బంది పడుతున్న సమంత, ఆ రుగ్మతను తగ్గించుకోవడం కోసం చాలా ఆరోగ్య సూత్రాలను పాటిస్తోంది. సమయానికి తిండి, నిదురతో పాటుగా శారీరక శ్రమ కూడా దీనికి అవసరం. కోల్పోయిన ఇమ్యూనిటీ పవర్ ని తిరిగి రాబట్టేందుకు ఒక వేదికగా జిమ్ ని ఉపయోగించుకుంటోంది. సమంత వీల్ బేస్ పై ఎక్సర్ సైజులకు సంబంధించిన తాజా వీడియో వైరల్ అవుతోంది.
పిల్లల దత్తత నిజమా?
నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సమంత రూత్ ప్రభు ఇద్దరు పిల్లలను దత్తత తీసుకోనున్నారని ఇటీవల ప్రచారం సాగుతోంది. ఇటీవల సమంత సినిమాల నుండి విరామం తీసుకుంది కానీ యాదృచ్ఛిక కారణాలతో హెడ్ లైన్స్ లో నిలిచింది. సమంతా ఒంటరి తల్లి గనుక తాను సొంతంగా పెంచాలనుకుంటున్న ఇద్దరు పిల్లలను దత్తత తీసుకోవాలని ఆలోచిస్తోందని, తన ఫౌండేషన్ 'ప్రత్యూష సపోర్టు'కి నిధులు సమకూర్చడంతో పాటు ఒకేసారి ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని తల్లి కావాలనుకుంటోందని కథనాలొస్తున్నాయి. సమంతా తల్లి ఆమెను పెళ్లి చేసుకోమని అడుగుతోంది. అయితే దానికి సమంత మాత్రం ప్రస్తుతం నో మ్యారేజ్ మైండ్‌సెట్‌ను పెంచుకుందని అంటున్నారు. సమంతా 2017 నుండి 2021 వరకు నాగ చైతన్యతో వైవాహిక జీవితంలో ఉంది. అయితే సడెన్ గా విడాకులు ప్రకటించడం ద్వారా అభిమానులను అకస్మాత్తుగా షాక్ కి గురి చేసారు. చై - సామ్ టాలీవుడ్లో అభిమానులకు ఇష్టమైన జంట.. కానీ వారు విడిపోవడానికి కారణమేమిటో తెలియకుండానే వారిద్దరూ విడిపోయారు.