ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ లో `సామ్ బహదూర్` కరెక్టేనా?
1971 ఇండో -పాక్ వార్ నేపథ్యంలో భారత్ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన సామ్ మానెక్ షా జీవితం ఆధారంగా మేఘనా గుల్జార్ తెరకెక్కిస్తు న్నారు.
ప్రపంచకప్ లో భాగంగా ఇండియా -పాకిస్తాన్ దేశాల మధ్య అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ జరు గుతున్న సంగతి తెలిసిందే. దాయాదితో పోరు అంటే ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ఇండియా ఏ దేశంతో ఆడినా రాని కిక్ పాకిస్తాన్ తో ఆడితే దొరుకుతుంది. అందుకే ఆ రోజు మ్యాచ్ కోసం ప్రత్యేకంగా దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను సైతం వేసారు. ఇక ఇండియా-పాక్ ప్రజలు రోజంతా టీవీలకు అతుక్కుపోవడం మామూలే. మ్యాచ్ ఇండియాలోనే జరిగినా పాకిస్తాన్ ప్రేక్షకులు భారీ ఎత్తున హాజరవుతారు.
పోటీ వాతావరణంలో అక్కడక్కడా చిన్న పాటి అల్లర్లు చోటు చేసుకోవడం సహజంగా కనిపిస్తుంది. సరిగ్గా ఇదే సన్నివేశాన్ని బాలీవుడ్ చిత్రం `సామ్ బహదూర్` ఎన్ క్యాష్ చేసుకోవడానికి ప్లాన్ చేసిందా? అహ్మదా బాద్ వేదికగా టీజర్ రిలీజ్ చేస్తున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. ఈ సినిమా టీజర్ ని మ్యాచ్ సందర్భంగా అదే రోజున రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది దేశ భక్తి నేపథ్యంగల చిత్రం.
పైగా పాకిస్తాన్ తో పోరాడిన ఓ యోధుడి గాథ. 1971 ఇండో -పాక్ వార్ నేపథ్యంలో భారత్ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన సామ్ మానెక్ షా జీవితం ఆధారంగా మేఘనా గుల్జార్ తెరకెక్కిస్తు న్నారు. సామ్ మానెక్ షా పాత్రలో విక్కీ కౌశల్ పోషిస్తున్నాడు. సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే పాకిస్తాన్ తో మ్యాచ్ సందర్భంగా టీజర్ ని అహ్మదాబాద్ లో రిలీజ్ చేయడం అన్నది అతిగా ఉందనే విమర్శ తెరపైకి వస్తోంది.
ప్రపంచకప్ కి భారత్ ఆదిథ్యమిస్తున్న దేశం..ఇతర దేశాల్ని..క్రీడాకారుల్ని గౌరవించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. శత్రుదేశమైనా ఆటలో అంతా సమానమే. అయితే పాకిస్తాన్ తో మ్యాచ్ సందర్భంగానే టీజర్ రిలీజ్ చేయడం అన్నది అతిగా ఉందని...సినిమా పబ్లిసిటీ కోసం ఆ రోజున ఎంపిక చేసుకోవడం అన్నది కరెక్ట్ కాదనే విమర్శ వినిపిస్తుంది. టీజర్ లో ఏదైనా వివాదాస్పద అంశం ఉంటే? పాకిస్తాన్ మనోభవాలు దెబ్బ తినే అవకాశం ఉందని అంటున్నారు. ఇది సినిమాకి మంచి పబ్లిసిటీ తెచ్చి పెట్టినా! వివరణ ఇవ్వాల్సిన చోట ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుందనే విమర్శ తెరపైకి వస్తోంది.