సామ్ అల్ట్రా గ్లామర్ డోస్.. మైండ్ బ్లాక్

ఇదిలా ఉంటే సమంత అప్పుడప్పుడు కొన్ని ఫ్యాషన్ ఈవెంట్స్ లో ప్రత్యక్షం అవుతోంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోషూట్ తో సందడి చేస్తోంది.

Update: 2023-11-28 04:04 GMT

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న అందాల భామ సమంత. ఈ బ్యూటీ ఈ ఏడాది శాకుంతలం, ఖుషి సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. వీటిలో శాకుంతలం డిజాస్టర్ కాగా ఖుషి ఎవరేజ్ టాక్ తో బయటపడింది. వీటి తర్వాత సినిమాలకి కొంత విరామం ఇచ్చిన అమ్మడు ప్రస్తుతం ఓ వైపు వెకేషన్స్ కి రెగ్యులర్ గా వెళ్తూ సేదతీరుతుంది.


మరో వైపు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఫిట్ నెస్ మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తోంది. కఠోర సాధనతో మరల మునుపటి అందం, వేగం అందుకోవాలని సమంత ప్రయత్నం చేస్తోంది. కంప్లీట్ గా ఏడాది పాటు యాక్టింగ్ కి గ్యాప్ ఇచ్చి తరువాత బిజీ అవ్వాలనే ఆలోచనలో ఉంది. హిందీలో సిటాడెల్ వెబ్ సిరీస్ కూడా కొన్ని ఎపిసోడ్స్ కంప్లీట్ చేసింది.


వాటికి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం నడుస్తోంది. సమంత చేతిలో రెండు, మూడు ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ ఆమె రెడీ అయినపుడు అవన్నీ తెరపైకి వస్తాయి. ఇదిలా ఉంటే సమంత అప్పుడప్పుడు కొన్ని ఫ్యాషన్ ఈవెంట్స్ లో ప్రత్యక్షం అవుతోంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోషూట్ తో సందడి చేస్తోంది.


ఫ్యాన్స్ కి నిత్యం అందుబాటులో ఉంటోంది. సోషల్ మీడియా ద్వారానే సమంత అందరికి చేరువ అయ్యే ప్రయత్నం చేస్తోంది. తాజాగా సమంతకి సంబందించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కళ్ళజోడు పెట్టుకొని షర్ట్, జీన్స్ ధరించి ఏదో ఈవెంట్ కి అటెండ్ అయ్యింది. అందులో ఆమె స్మైల్ ని కెమెరామెన్ అందంగా బంధించారు.

సమంత ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసిన అవి ఫ్యాషన్ బ్రాండ్స్ గా మారిపోతాయని ఈ ఫోటో చూస్తున్న నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. స్టైలిష్ కి కేరాఫ్ అడ్రెస్ గా ఇప్పుడు ఇండియన్ ఫ్యాషన్ ప్రపంచంలో మారిపోయిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఫోటోలని సమంత ఫ్యాన్స్ ట్విట్టర్ లో వైరల్ చేస్తున్నారు. ఆమె ఫోటోలకి ఫ్యాన్స్ నుంచి ఏ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Tags:    

Similar News