సముద్రఖని బ్రో.. మళ్ళీ మొదటికి..
మరల యాక్టర్ గా బిజీ అయ్యే పనిలో ఉన్నారని తెలుస్తోంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీలో మెయిన్ విలన్ గా సముద్రఖని కనిపించబోతున్నారంట.
దర్శకుడిగా కెరియర్ స్టార్ట్ చేసిన సముద్రఖని తరువాత నటుడిగా టర్న్ తీసుకొని కోలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకున్నాడు. స్టార్ హీరోల చిత్రాలలో కూడా నటించాడు. అక్కడి నుంచి టాలీవుడ్ లో మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ గా మారిపోయాడు. అల వైకుంఠపురంలో సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా నటించి సముద్రఖని మెప్పించారు. తరువాత తెలుగులో స్టార్ యాక్టర్ గా మారిపోయారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలో కీలక పాత్రలో నటించారు. సర్కారువారిపాట సినిమాలో విలన్ గా సముద్రఖని నటించారు. భీమ్లా నాయక్, మాచర్ల నియోజకవర్గం, సార్ సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించారు. వీటితో పాటు కొన్ని చిన్న సినిమాలలో కూడా సముద్రఖని లీడ్ యాక్టర్ గా చేశారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఇండియన్ 2, గేమ్ చేంజర్ సినిమాలలో సముద్రఖని కీలక పాత్రలలో నటిస్తూ ఉండటం విశేషం.
ఇలా చేతినిండా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. హైయెస్ట్ పెయిడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సముద్రఖని ప్రస్తుతం దూసుకుపోతున్నారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బ్రో మూవీకి దర్శకత్వం చేసే అవకాశం రావడంతో ఏడాది పాటు యాక్టింగ్ కి దూరంగా ఉన్నారు. పూర్తిగా దర్శకత్వంపై ఫోకస్ పెట్టారు. బ్రో మూవీ రిలీజ్ అయ్యి ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది. సినిమా బజ్ కూడా అయిపొయింది.
దీంతో సముద్రఖని మరల తాను కమిట్ అయిన సినిమాలతో పాటుగా కొత్త ప్రాజెక్ట్స్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మరల యాక్టర్ గా బిజీ అయ్యే పనిలో ఉన్నారని తెలుస్తోంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీలో మెయిన్ విలన్ గా సముద్రఖని కనిపించబోతున్నారంట.
రీసెంట్ గా విమానం అనే సినిమాతో నటుడిగా సముద్రఖని ప్రేక్షకుల ముందుకి వచ్చారు. అందులో వికలాంగుడు అయిన తండ్రి పాత్రలో అతను నటించారు. విమానం ఎక్కాలనే కొడుకు కోరిక తీర్చడానికి పరితపించే తండ్రి పాత్రలో కన్నీళ్లు పెట్టించారు. అయితే ఈ మూవీ ఆశించిన స్థాయిలో థియేటర్స్ లో ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. అయితే ఒటీటీలో మాత్రం మంచి ఆదరణ సొంతం చేసుకుంటుంది.