డాకు మహారాజ్ : ఒక్క ఫోన్ కాల్‌తో వచ్చినందుకు థాంక్స్!
కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్‌లో కనిపించగా కొన్ని సినిమాల్లో ఫుల్ లెంగ్త్ రోల్స్ లో కనిపిస్తున్న విషయం తెల్సిందే.
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నాగవంశీ నిర్మించిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. సినిమాపై అంచనాలు పెంచే విధంగా ట్రైలర్ ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ట్రైలర్‌లో దర్శకుడు సందీప్ రాజ్ కనిపించి సర్‌ప్రైజ్ చేశాడు. ఈ మధ్య కాలంలో ఈ యువ దర్శకుడు సినిమాల్లో నటుడిగా కనిపిస్తున్నాడు. కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్‌లో కనిపించగా కొన్ని సినిమాల్లో ఫుల్ లెంగ్త్ రోల్స్ లో కనిపిస్తున్న విషయం తెల్సిందే.
సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. దర్శకుడు బాబీ ఏ విషయంలోనూ అజాగ్రత్తగా ఉండకుండా ఈ సినిమాను రూపొందించాడు. వాల్తేరు వీరయ్య వంటి కమర్షియల్ హిట్ సినిమాను చేసిన బాబీ ఈ సినిమాను మరోసారి అదే తరహా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందించాడు. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో సందీప్ రాజ్‌ని నటింపజేయడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ట్రైలర్‌లోని విజువల్స్ చూస్తుంటే సినిమాలో సందీప్ రాజ్ పాత్ర ఆకట్టుకునే విధంగా ఉంటుంది అనిపిస్తుంది. నటుడిగా ఇప్పటికే పలు సార్లు మంచి పేరు సొంతం చేసుకున్న సందీప్ రాజ్‌కి ఈ సినిమా మరోసారి మంచి మార్కులు తెచ్చి పెడుతుందేమో చూడాలి.
బాలకృష్ణ మాస్ యాక్షన్ సన్నివేశాలతో పాటు బాబీ ఈ సినిమాలో కొన్ని సర్‌ప్రెజ్‌లు ఇవ్వడం ద్వారా అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది. ఈ సినిమాలో ఒక యంగ్ హీరో గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ హీరో ఎవరు అనే విషయమై క్లారిటీ రాలేదు. ఇక 'డాకు మహారాజ్' సినిమాలో నటించడంపై దర్శకుడు సందీప్ రాజ్ స్పందిస్తూ చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి రావాలని కలలు కన్నాను. ఆ కల సాకారం అయినట్లుంది అంటూ ట్వీట్ చేశాడు. జాతీయ స్థాయి అవార్డును సొంతం చేసుకున్న దర్శకుడిగా సందీప్ రాజ్ కి మంచి పేరు వచ్చింది. అయినా దర్శకుడిగా వరుస సినిమాలు తీయకుండా ఆచి తూచి సినిమాలు చేస్తున్నాడు.
దర్శకుడిగా బిజీగా ఉన్న సందీప్ రాజ్ డాకు మహారాజ్ సినిమాలో నటించడంపై బాబీ స్పందిస్తూ... ఒక్క ఫోన్ కాల్‌తో తర్వాత రోజే వచ్చి షూటింగ్‌లో పాల్గొన్నందుకు థాంక్స్ తమ్ముడు అంటూ సందీప్ రాజ్‌కి కృతజ్ఞతలు తెలియజేశాడు. కెరీర్ ఆరంభం నుంచి దర్శకుడు బాబీ చేస్తున్న సినిమా దేనికి అదే అన్నట్లుగా వైవిధ్యభరితంగా ఉండటం మాత్రమే కాకుండా కమర్షియల్ హిట్స్‌ను దక్కించుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో పాటు గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రాబోతున్నాయి. ఆ రెండు సినిమాలకు ఈ సినిమా ఏ మేరకు పోటీగా నిలుస్తుంది అనేది చూడాలి.