అవార్డుల బంధం: ద‌ర్శ‌కుడితో న‌టి క‌ర‌చాల‌నం

మృణాల్ ఠాకూర్ - సందీప్ రెడ్డి వంగా ఈ రెండు పేర్లు సెన్సేష‌న్స్ కి కేరాఫ్ గా నిలిచాయి.

Update: 2024-09-16 05:03 GMT

మృణాల్ ఠాకూర్ - సందీప్ రెడ్డి వంగా ఈ రెండు పేర్లు సెన్సేష‌న్స్ కి కేరాఫ్ గా నిలిచాయి. ఇటీవ‌ల వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకుపోతున్న ప్ర‌ముఖ సినీ సెల‌బ్రిటీలు ఆ ఇద్ద‌రూ. ఇప్పుడు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2024 (SIIMA 2024)లో విజయాలు సాధించారు. ఈవెంట్ నుండి అవార్డులు అందుకుని క‌నిపించారు. ఒక వీడియోలో మృణాల్ - సందీప్ ఒకే సమయంలో ఈవెంట్‌లోకి వెళ్లడం కనిపించింది. మృణాల్ ట్యాలెంటెడ్ సందీప్ వంగాను చూడ‌గానే అతడి వైపున‌కు వెళ్లి మృణాల్ పలకరించింది. ఆ తర్వాత అతడి అవార్డును గమనించి అభినందించింది. ఆ ఇద్ద‌రూ ఆప్యాయంగా కరచాలనం చేయడాన్ని అభిమానులు గమనించారు.

అవార్డ్స్ షోకి వెళ్లే ముందు వీరిద్దరూ మాట్లాడుకుంటున్న విజువ‌ల్స్ ఉన్నాయి. ఒక‌రికొక‌రు ప‌ల‌క‌రింపులో ఆప్యాయంగా క‌నిపించారు. అవార్డుల కార్యక్రమంలో మృణాల్ అద్భుత‌మైన‌ చీర కట్టుతో కనిపించ‌గా, సందీప్ రెడ్డి వంగా ఒక సాధారణ బ్లూ కుర్తా డెనిమ్‌తో కనిపించాడు.

సైమా-2024లో మృణాల్ ఠాకూర్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. హాయ్ నాన్న చిత్రానికి గానూ ఈ అవార్డు లభించింది. కాగా సందీప్ రెడ్డి వంగాకు `సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్` అవార్డు లభించింది. అది అత‌డి స్వ‌భావానికి శైలికి సింబాలిక్ అవార్డ్ అన్న చ‌ర్చా వేదిక వ‌ద్ద సాగింది. హాయ్ నాన్న నటుడు నాని `దసరా`లో న‌ట‌న‌కు గాను ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నాడు. అదే సమయంలో కన్నడ చిత్రం కాంతార‌ ఉత్తమ చిత్రంగా నిలిచింది.

SIIMA ఉత్స‌వం ఈ ఏడాది దుబాయ్‌లో జరిగింది. అక్క‌డ తెలుగు ప్ర‌తిభ మెరుపులు మెరిపించింది. దసరా చిత్రం ఉత్త‌మ న‌టుడు స‌హా అనేక ఇతర అవార్డులను కూడా గెలుచుకుంది. ఇదే వేదిక‌పై కీర్తి సురేష్‌ ఉత్తమ నటిగా, శ్రీకాంత్ ఓదెల ఉత్తమ దర్శకుడుగా సైమా అవార్డులు గెలుచుకున్నారు.

Tags:    

Similar News