టాలీవుట్ ట్యాలెంట్ ని మెచ్చిన హీరో మాజీ భార్య‌!

రెండ‌వ సినిమాతోనే అలా అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఇంత‌వ‌ర‌కూ ఇలాంటి రికార్డు ఏ ద‌ర్శ‌కుడి పేరిట లేదు. ఆ ర‌కంగా సందీప్ ప్ర‌తిభ‌ని ఎంత మెచ్చినా త‌క్కువే

Update: 2024-03-14 03:15 GMT

రెండు సినిమాలతోనే పాన్ ఇండియాలో ఫేమ‌స్ అయిన తెలుగు దర్శ‌కుడు సందీప్ వంగ‌. 'అర్జున్ రెడ్డి'..'యానిమ‌ల్' విజ‌యాలు సందీప్ ని ఏ స్థానంలో కూర్చోబెట్టాయో చెప్పాల్సిన ప‌నిలేదు. 'అర్జున్ రెడ్డి' ని బాలీవుడ్ లో 'క‌బీర్ సింగ్' గా రీమేక్ చేసి అక్క‌డా బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాడు. అటుపై ఏకంగా బాలీవుడ్ హీరో ర‌ణ‌బీర్ కపూర్ హీరోగా పెట్టి 'యానిమ‌ల్' తెర‌కెక్కించి పాన్ ఇండియాలోనే స‌త్తా చాటాడు. ఆ సినిమా ఏకంగా 900 కోట్ల‌కుపైగా వ‌సూళ్లు సాధించిన సంగ‌తి తెలిసిందే.

రెండ‌వ సినిమాతోనే అలా అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఇంత‌వ‌ర‌కూ ఇలాంటి రికార్డు ఏ ద‌ర్శ‌కుడి పేరిట లేదు. ఆ ర‌కంగా సందీప్ ప్ర‌తిభ‌ని ఎంత మెచ్చినా త‌క్కువే. ఈ విజ‌యం త‌ర్వాత టాలీవుడ్ టూ బాలీవుడ్ హీరోలంతా సందీప్ కోసం క్యూ క‌ట్టారు. త‌ద‌రుప‌రి ప్ర‌భాస్ తో చేస్తోన్న 'స్పిరిట్' కూడా స‌క్సెస్ అయితే సందీప్ రేంజ్ ఏకంగా ఆకాశాన్నే అంటుంది. ఇండియన్ బెస్ట్ డైరెక్ట‌ర్ల‌లో అత‌డి పేరు నిలుస్తుం ది. తాజాగా ఈ ప్ర‌తిభా వంతుడ్ని మిస్ట‌ర్ ప‌ర్ పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ మాజీ భార్య కిర‌ణ్ రావ్ కూడా ఆకాశానికి ఎత్తేసారు.

సందీప్ క్రాప్ట్ అద్బుతంగా ఉంటుంద‌ని.. యానిమ‌ల్ సినిమా ఇంకా చూడ‌లేద‌ని..విడుద‌లై చాలా రోజులు గ‌డుస్తున్నా త‌న‌లో ఇంకా చూడాల‌నే ఉత్సాహం అలాగే ఉంద‌న్నారు. ఇలాంటి సినిమాలు చూడ‌టం నాలాంటి అవ‌స‌రంగా భావిస్తున్నాను. ప్ర‌జ‌లంతా యానిమ‌ల్ ని ఇష్ట‌ప‌డ్డారు కాబ‌ట్టే అంత పెద్ద విజ‌యం సాధించింది. అందుకు ర‌ణ‌బీర్ క‌పూర్ లాంటి ట్యాలెంటెడ్ న‌టుడు దొర‌క‌డం కూడా సినిమాకి క‌లిసొచ్చిన అంశం అన్నారు.

కిర‌ణ్ రావ్ డైరెక్ట‌ర్ చేసిన 'ల‌ప‌ట్టా లేడీస్' ఇటీవ‌ల రిలీజ్ అయి మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత కిర‌ణ్ రావు డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ద‌ర్శ‌కురాలిగా ఆమె తొలి సినిమా ధోబీ ఘాట్. నిర్మాత‌గా..ప్ర‌జెంట‌ర్ గా చాలా సినిమాల‌కు ప‌నిచేసారు. అమీర్ ఖాన్ తో వేరైన త‌ర్వాత మ‌ళ్లీ కెప్టెన్ కుర్చీ ఎక్కారు.

Tags:    

Similar News